రంగస్థలంపై చిరు!

Chiranjeevi, SS Rajamouli on the sets of Rangasthalam 1985 - Sakshi

నిజమే! రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’పైకి చిరంజీవి వచ్చారు. అయితే... ఆయనొచ్చింది ‘రంగస్థలం’పైకి మాత్రమే, సిన్మాలోకి కాదు. అదేంటి? అందులో తేడా ఏంటి? అనుకుంటు న్నారా! నిన్న (బుధవారం) హైదరాబాద్‌లో జరుగుతున్న ‘రంగస్థలం’ షూటింగ్‌కి చిరంజీవి వెళ్లారు. సెట్స్‌పై కాసేపు సందడి చేశారు.

అంటే... ‘రంగస్థలం’పై చిరు కాసేపు ఉన్నట్టే కదా! చిరూతో పాటు దర్శకుడు రాజమౌళీ సేమ్‌ టైమ్‌లో ‘రంగస్థలం’ సెట్స్‌కి వెళ్లారు. ఇటీవలే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ తండ్రీకొడుకులు చిరు, చరణ్‌లకు ఓ కథ రాయాలనుందనీ, ఆ కథను రాజమౌళే డైరెక్ట్‌ చేయాలనుందనీ ఆయన మనసులో మాటను చెప్పారు. బహుశా... ఆ సినిమా విషయం ఏమైనా చర్చకు వచ్చిందంటారా? వెయిట్‌ అండ్‌ సీ!!

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top