మెగా మూవీస్కు బ్రేక్ | Chiranjeevi, Ram charan to take a break for Srija marriage | Sakshi
Sakshi News home page

మెగా మూవీస్కు బ్రేక్

Feb 21 2016 8:11 AM | Updated on Sep 3 2017 6:07 PM

మెగా మూవీస్కు బ్రేక్

మెగా మూవీస్కు బ్రేక్

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు మరో షాక్ తగిలింది.

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు మరో షాక్ తగిలింది. త్వరలోనే 150వ సినిమా ఎనౌన్స్ చేస్తారనుకున్న సమయంలో చిరు ఇంట్లో పెళ్లి సందడి మొదలు కావటంతో, మరోసారి చిరు సినిమా వాయిదా పడింది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి సందర్భంగా తన రీ ఎంట్రీ సినిమాను రెండు నెలలు వాయిదా చేశాడు మెగాస్టార్.

అంతేకాదు చరణ్ కూడా చెల్లి పెళ్లి కోసం బ్రేక్ తీసుకుంటున్నాడట. బ్రూస్ లీ సినిమా తరువాత ఇంతవరకు షూటింగ్లో పాల్గొనని రామ్ చరణ్, ఈ నెలాఖరున షూటింగ్ మొదలు పెడతారని భావించారు. అయితే శ్రీజ పెళ్లి పనులతో బిజీగా ఉండటంతో మరో పది రోజుల పాటు షూటింగ్కు హాజరు కాలేనంటూ దర్శక నిర్మాతలకు చెప్పేశాడట. మరి ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న చెర్రీ అనుకున్న సమయానికి సినిమాను ఎలా రెడీ చేస్తాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement