ప్రేమమ్ తర్వాత... | Chandu Mondeti's next with iDream | Sakshi
Sakshi News home page

ప్రేమమ్ తర్వాత...

Sep 3 2016 10:55 PM | Updated on Sep 4 2017 12:09 PM

ప్రేమమ్ తర్వాత...

ప్రేమమ్ తర్వాత...

‘కార్తికేయ’తో దర్శకుడిగా పరిచయమైన చందు మొండేటి, తొలి చిత్రంతోనే విజయం అందుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ‘ప్రేమమ్’

 ‘కార్తికేయ’తో దర్శకుడిగా పరిచయమైన చందు  మొండేటి, తొలి చిత్రంతోనే విజయం అందుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ‘ప్రేమమ్’ తెరకెక్కిస్తున్నారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ప్రేమమ్’ తర్వాత ఐ డ్రీమ్ మీడియా సంస్థ నిర్మించబోయే సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఐ డ్రీమ్ సంస్థ వ్యవస్థాపకులు వాసుదేవరెడ్డి, రాజ్ కుమార్ ఆకెళ్లతో ఎంతో కాలంగా పరిచయముందని చందు మొండేటి తెలిపారు. ఈ ఏడాది ఆఖరున ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. హీరో హీరోయిన్లు, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్ర నిర్మాత వాసుదేవరెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement