వింత వ్యాధితో బాధపడుతున్న బన్నీ హీరోయిన్‌! | Catherine Tresa Suffering From Anosmia disease | Sakshi
Sakshi News home page

వింత వ్యాధితో బాధపడుతున్న బన్నీ హీరోయిన్‌!

Oct 20 2019 5:01 PM | Updated on Oct 20 2019 5:03 PM

Catherine Tresa Suffering From Anosmia disease - Sakshi

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ఇద్దరు అమ్మాయిలతో, సరైనోడు సినిమాల్లో తన అందాలతో యువతను ఆకట్టుకుంది గ్లామరస్‌ బ్యూటీ కేథరిన్ ట్రెసా‌. సరైనోడులో గ్లామరస్‌ ఎమ్మెల్యేగా తన అందంతో కుర్రకారులకు పిచ్చెక్కించింది. ఆ సినిమాలో ఆమెతో ఉన్న సన్నివేశాలను సినిమాకే హైలెట్‌. టాలీవుడ్‌ చాలా సినిమాలే చేసినా ఈ అందాల భామకు ఆశించన గుర్తింపు మాత్రం రాలేదు. అయితే కోలీవుడ్‌లో మాత్రం వరుస విజయాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు చెబుతూ.. వింత వ్యాధితో బాధపడుతున్నానని చెప్పింది ఈ అమ్మడు. ఈ జబ్బు కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొంటుందట. ఇంతకీ ఈ బ్యూటీకి వచ్చిన జబ్బు ఏంటో తెలుసా.. అనోస్మియ. ఈ జబ్బు ఉన్న వారు వాసన చూడలేరు. ఎంత సువాసన అయినా.. ఎంత దుర్వాసన అయినా వారికి తెలియదు. వాసన చూసే శక్తి వారికి అస్సలు ఉండదు.

ఈ జబ్బు ఉన్న కారణంగా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకోకూడదని భావిస్తుందట. లక్షల్లో ఒక్కరికి వచ్చే ఈ జబ్బు కేథరిన్ కు రావడం పట్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తన జబ్బు సినిమాల్లో నటించడానికి అడ్డు కాదని క్యాథరిన్‌ టెస్రా అంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement