రాముడి పేరుతో బ్లౌజ్‌.. కేసు నమోదు

Case Files On Vaani Kapoor For Ram Name Top - Sakshi

బాలీవుడ్‌ కథానాయిక వాణీ కపూర్ వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఆమె వేసుకున్న దుస్తులు తమ మత సాంప్రదాయాలను, మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ ముంబైలో ఓ వ్యక్తి  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు ఎమ్‌ఎన్‌ జోసీ మార్గ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల ఆమె వేసుకున్న దుస్తులతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. లైట్ పింక్ కలర్ బ్లౌజ్ వేసుకుని అందాలు ఆరబోస్తూ ఫొటో షూట్ దిగారు.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ బ్లౌజ్‌పై రాసున్న అక్షరాలే ఈ వివాదానికి కారణం. ఆ బ్లౌజ్‌పై హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీరాముడి పేరు రాసుంది. బ్లౌజ్ మొత్తం ఆయన పేరుతో ప్రింట్ అయివుంది. దాంతో వాణీకపూర్‌ హిందువుల సంప్రదాయాన్ని మంటగలిపిందని, వారి మనోభావాలను దెబ్బతీసిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు. వారి పోరు తట్టుకోలేక కొంతసమయం తరువాత ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేసింది. కాగా తెలుగులో ‘ఆహా కళ్యాణం’ సినిమాతో ప్రేక్షకులకు వాణీ కపూర్ పరిచయమైన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top