మన దుస్తులే ఇష్టం! | Cannes Film Festival 2014: Sonam Kapoor to Dazzle on Red Carpet | Sakshi
Sakshi News home page

మన దుస్తులే ఇష్టం!

May 3 2014 11:22 PM | Updated on Sep 2 2017 6:53 AM

మన దుస్తులే ఇష్టం!

మన దుస్తులే ఇష్టం!

నిత్యం అంతర్జాతీయ కంపెనీల దుస్తులతో మెరిసిపోయే సోనమ్‌కపూర్‌కు భారతీయ దుస్తులు, డిజైనర్లే ఇష్టమట. విదేశాల్లో ప్రదర్శనలకు వెళ్లినప్పుడు

నిత్యం అంతర్జాతీయ కంపెనీల దుస్తులతో మెరిసిపోయే సోనమ్‌కపూర్‌కు భారతీయ దుస్తులు, డిజైనర్లే ఇష్టమట. విదేశాల్లో ప్రదర్శనలకు వెళ్లినప్పుడు దేశీయ వస్త్రాలనే వేసుకుంటానని చెప్పింది. మనం మన శరీరాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే తగిన దుస్తులను ఎంచుకోవడం సులువవుతుందని చెప్పిన సోనమ్, ఈ నెల 18 నుంచి జరిగే కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో హల్‌చల్ చేయనుంది. ‘లో ఓరియల్’ ఉత్పత్తుల ప్రచారకర్త హోదాలో ఈమె కేన్స్ వేదికపై కనిపించనుంది. ‘విదేశాలకు వెళ్లినప్పుడల్లా మన డిజైన్లను ప్రచారం చేయడానికే నేను ప్రయత్నిస్తాను. సత్తా ఉన్న డిజైనర్లు ఎందరో మన దగ్గర ఉన్నారు.
 
 అందుకే నేను మీడియా సమావేశాల్లో భారతీయ ఆభరణాలు లేదా వస్త్రాలు ధరిస్తాను’ అని ఈ 28 ఏళ్ల ఫ్యాషన్ ప్రియురాలు చెప్పింది. గతంలో కేన్స్ ఉత్సవాలకు వెళ్లినప్పుడు సోనమ్ చీర, జాకెట్‌తో కనిపించి అందరి ప్రశంసలూ దక్కించుకుంది. ముక్కుకు కుందన్ రింగుతో మరింత మనోహరంగా కనిపించింది. ఈ వస్త్రాలను డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించింది. ‘నేను పాశ్చాత్య వస్త్రాలు ధరించినా భారతీయ నగలే వేసుకుంటాను.
 
 ఇంతకుముందు ఫ్లోరల్ డాల్స్ అండ్ గబ్బానా గౌన్ వేసుకున్నప్పుడు కూడా మెడలో దేశీ తయారీ గొలుసు వేసుకున్నాను. నా శరీరాకృతిని బట్టే దుస్తులను ఎంచుకుంటాను. ప్రస్తుత ఫ్యాషన్‌కు అనుగుణంగా దుస్తులు వేసుకోకుండా, మనకు ఏది అనుగుణంగా ఉంటే అదే వేస్కోవాలి. నా స్నేహితులకు ఎపుడూ ఇదే విషయం చెబుతుంటాను’ అని వివరించింది. కేన్స్ కనిపించిన బాలీవుడ్ తారల్లో తనకు విద్యాబాలన్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఆమె దుస్తులు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని, చీర  కంటే గొప్ప వస్త్రం ఏదీ లేదని సోనమ్ స్పష్టం చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement