బృందావనంలో కొత్తవాళ్లు! | Brundavanamadi Andaridi new movie | Sakshi
Sakshi News home page

బృందావనంలో కొత్తవాళ్లు!

Aug 1 2017 11:37 PM | Updated on Sep 17 2017 5:03 PM

బృందావనంలో కొత్తవాళ్లు!

బృందావనంలో కొత్తవాళ్లు!

బృందావనమది అందరిది’ చిత్రంతో తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన శ్రీధర్‌ సీపాన దర్శకుడిగా మారుతున్నారు.

‘బృందావనమది అందరిది’ చిత్రంతో తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన శ్రీధర్‌ సీపాన దర్శకుడిగా మారుతున్నారు. అంతా కొత్త నటీనటులతో తీయనున్న ఈ సినిమా గురించి శ్రీధర్‌ సీపాన మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా మారడం ఆనందంగా ఉంది. రచయితగా నన్ను ఆదరించిన ప్రేక్షకులు దర్శకుడిగానూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

 జంధ్యాలగారిలా అందరూ నవ్వుకునే సినిమాలు తీయాలనుకుంటున్నాను. అందుకే కమర్షియల్‌ కథలు ఉన్నా అవన్నీ పక్కనపెట్టి ఈ వినోదాత్మక కథను ఎంచుకున్నాను. వినోదాత్మకంగా ఉంటూనే మనలోని బంధాలను గుర్తు చేసేలా ఉంటుందీ సిన్మా. కథ, ఫైట్లు, పాటలు ఉండే సాధరణ చిత్రంలా ఉండదు. ఈ సినిమాతో దర్శకుడిగా నాకో మార్క్‌ తెచ్చుకోవాలనుకుంటున్నాను’’అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement