
సంజయ్ దత్ మాంసాహారాన్ని ఇష్టంగా తింటారు. ఎంత ఇష్టం అంటే ముంబైలో ఆయన రెసిపీతో ఓ హోటల్‌లో ‘చికెన్ సంజు బాబా’ అనే వంటకాన్ని కూడా వడ్డిస్తారట. అయితే ఇప్పుడు ఆయన నాన్ వెజ్‌కి నో చెబుతున్నారట. సంజయ్ శాకాహారిగా మారిపోయారని బాలీవుడ్ టాక్. లాక్ డౌన్ సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారట సంజు భాయ్. క్వారంటైన్ సమయం మొదలయిన దగ్గర నుంచి కేవలం శాకాహారాన్నే తీసుకుంటున్నారని సమాచారం. ఇదే పద్ధతిని సంజయ్ దత్ భవిష్యత్తులోనూ పాటించాలనుకుంటున్నారట.