తారలపై విసుర్లు 

Body Shaming on Bollywood Stars in Social Media - Sakshi

తప్పు కదా!

సోషల్‌ మీడియాలో బాలీవుడ్‌ తారలపై బాడీ షేమింగ్‌ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్లేదో ఫొటో పోస్ట్‌ చేస్తారు. వీళ్లు దానిపై కామెంట్‌ చేస్తారు. దీపికా పదుకోన్‌ నలుపు రంగు సింగిల్‌ పీస్‌ డ్రెస్‌ ధరించి పోస్ట్‌ చేసిన ఫొటోలో చాలా బక్కగా ఉన్నారు. ‘ఎముకలున్నాయి, మరి స్కిన్‌ ఎక్కడ? అని ఓ నెటిజెన్‌ కామెంట్‌ చేశారు. ప్రియాంక చోప్రా తన పెదవుల్ని ముందుకు తెచ్చి తీసుకున్న సెల్ఫీపై కూడా ట్రోలింగ్‌ జరిగింది. ఇంత బండ పెదవులేమిటని! దిషా పటానీ అయితే ‘బక్క’తనానికి పీక్‌ గ్రేడ్‌ అయిన ‘పీల’ స్థాయికి బాడీషేమింగ్‌కి గురయ్యారు. పరిణీతి చోప్రా బొద్దుగా ఉంటారు. తిండి తగ్గించమని ఆమెకు కొన్ని వేల ఉచిత సలహాలు లభించాయి. తనిష్ట చటర్జీ ఒంటి రంగు మీద ఓ కామెడీ షోలో షేమింగ్‌ జరిగింది.

నవ్వుతూ నవ్వుతూనే తనది ‘రోస్టెడ్‌ స్కిన్‌’ అన్నందుకు తనిష్ట చాలా బాధపడ్డారు. అనేరి వజానీ టీవీ నటి. ఆమె తన బక్కపలుచని ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టీపెట్టగానే∙బాడీ షేమింగ్‌ మొదలైంది. ‘చీపురు పుల్ల’ అంటూ. ఇలియానాను కూడా ఒకప్పుడు బాడీ షేమింగ్‌ చేశారట. నడుము కింది భాగం ఎక్కువగా ఉంటుందని. ఇవన్నీ ఇలా ఉంచితే సాటి నటే తన సహనటిని షేమ్‌ చేసిన ఉదంతం కూడా ఉంది. ‘ఆ మనిషికి హెడ్‌లైట్‌ ఎక్కడుంటుందో, బంపర్‌ ఎక్కడ ఉంటుందో చెప్పడం కష్టం. కాలేజీ పిల్లలు నయం. తీరుగా కనిపిస్తారు’ అని భైరవి గోస్వామి.. కీర్తీ సనన్‌పై ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు. తప్పు కదా. ఎప్పటికి ఎదుగుతాం?!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top