అడిగి పెళ్లి చేస్తాం: రాహుల్‌ తల్లిదండ్రులు

Bigg Boss 3 Telugu Winner: Parents Respond On Rahul Marriage - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో రాహుల్‌-పునర్నవిల రిలేషన్‌షిప్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వీకెండ్‌లో వచ్చే నాగార్జున వారి మధ్య అలకలను, ప్రేమను గుర్తుచేస్తూ సెటైర్లు విసిరేవాడు. ఇక పునర్నవి రాహుల్‌కు గోరుముద్దలు తినిపించడం, అదే సమయంలో తప్పుచేస్తే అతన్ని చెడామడా తిట్టడం.. ఇంట్లో ఏం జరిగినా ఇద్దరు కలిసే ఉండటం ప్రేక్షకులను మెప్పించింది. ఓరోజు ఎలాగోలా ధైర్యం చేసిన రాహుల్‌.. డేటింగ్‌కు వస్తావా అని పునర్నవిని సరదాగా అడగడం అప్పట్లో హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

టాస్క్‌లు ఆడటం చేతకాదని పేరు తెచ్చుకున్న రాహుల్‌.. పునర్నవి కోసం 20 గ్లాసుల కాకర జ్యూస్‌ను గటగటా తాగి ఆమెను నామినేషన్‌ నుంచి తప్పించాడు. దీంతో ఆనందం పట్టలేని పునర్నవి.. రాహుల్‌ను హత్తుకుని ముద్దులు కూడా ఇచ్చింది. ఇక పునర్నవి ఎలిమినేట్‌ అయినపుడు రాహుల్‌ వెక్కివెక్కి ఏడ్వటంతో ఆమెపై ఉన్న ప్రేమ మరోసారి బయటపడింది. పదకొండోవారంలో ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన పునర్నవి.. రాహుల్‌తో కలిసి ఫేస్‌బుక్‌ లైవ్‌ చేస్తానని అభిమానులకు మాటిచ్చింది. అటు గ్రాండ్‌ ఫినాలే స్టేజిపై రాహుల్‌ను విజేతగా ప్రకటించిన తర్వాత పునర్నవి తనను ఎంకరేజ్‌ చేసిందని ఆమెను పొగడ్తల్లో ముంచెత్తాడు.

అటు రాహుల్‌, ఇటు పునర్నవి.. మేం ఇద్దరం ప్రాణస్నేహితులమంటూ ఎప్పటికప్పుడు మాట దాటవేస్తూనే ఉన్నారు. అయితే రాహుల్‌ తల్లిదండ్రుల మాటలు ప్రేక్షకులను చిక్కుల్లో పడేశాయి. వారిది స్నేహమా? ప్రేమా అన్న అనుమానం వీక్షకుల్లో మరోసారి తలెత్తుతోంది. అటు రాహుల్‌ తల్లిదండ్రులు అతనికి లైఫ్‌ సెట్‌ చేసే పనిలో పడ్డారు. పనిలో పనిగా పెళ్లి విషయం గురించి కూడా మాట్లాడారు. అయితే బిగ్‌బాస్‌ వాళ్లు రాహుల్‌, పునర్నవి మధ్య కెమిస్ట్రీ నడుస్తుందన్న భావన కలిగించారని చెప్పుకొచ్చారు. కానీ అది బిగ్‌బాస్‌ హౌస్‌ వరకే ఉంటుందనుకుంటున్నామని తెలిపారు. రాహుల్‌ వచ్చిన తర్వాత అన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలన్నారు. వారికి ఇష్టమైతే పెళ్లి చేస్తామని ప్రకటించారు. ‘వాళ్లు నిజంగా లవ్‌ చేసుకుంటే వాళ్ల ఇష్టమే మా ఇష్టం.. వాళ్ల నిర్ణయమే మా నిర్ణయం.. పెళ్లి చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని వెల్లడించారు. ఇక బిగ్‌బాస్‌ ముగిసిందో లేదో అప్పుడే పీవీవీఆర్‌ (పునర్నవి, వరుణ్‌, వితిక, రాహుల్‌) కలిసి పార్టీ చేసుకున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top