శ్రీముఖిని దుమ్ముదులిపిన శివజ్యోతి | Bigg Boss 3 Telugu: Srimukhi, Ravi, Varun And Baba Bhaskar Nominated In Tenth Week | Sakshi
Sakshi News home page

శ్రీముఖిని దుమ్ముదులిపిన శివజ్యోతి

Sep 23 2019 11:04 PM | Updated on Sep 24 2019 1:19 AM

Bigg Boss 3 Telugu: Srimukhi, Ravi, Varun And Baba Bhaskar Nominated In Tenth Week - Sakshi

పదో వారం నామినేషన్‌ ప్రక్రియ రచ్చబండ కార్యక్రమంగా మారిపోయింది. మాటల యుద్దంతో బిగ్‌బాస్‌ హౌస్‌ దద్దరిల్లిపోయింది. ఇక నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా కెప్టెన్‌ను మినహాయించి.. మిగతా వారిని జంటలుగా విడగొట్టాడు. శివజ్యోతి-శ్రీముఖి, బాబా భాస్కర్‌-పునర్నవి, వితికా-రవి, వరుణ్‌-రాహుల్‌ అంటూ విడగొట్టారు. ఇక వీరందరికీ మూడు ప్రశ్నలను ఇచ్చి.. తమ తరుపున వాదించుకోమన్నారు. ఫైనల్‌గా ఇంటి సభ్యులందరూ వేసిన ఓట్ల ఆధారంగా నామినేట్‌ అవుతారని తెలిపాడు. 

ఈ క్రమంలో శివజ్యోతి-శ్రీముఖిల చర్చ హైలెట్‌గా నిలిచింది. ఇద్దరి మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. ఎమోషన్‌లోగా వీక్‌ అంటూ శ్రీముఖి అనగా.. అందరి సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ తీసేదంటూ.. ఫిజికల్‌ టాస్క్‌లు చేయదు, తనను ముట్టొద్దు అంటుందని కానీ తాను అలా చేయలేదని ఫిజికల్‌ టాస్కుల్లో కూడా వందశాతం ఎఫర్ట్‌ పెడతానని  శివజ్యోతి చెప్పుకొచ్చింది. చివరకు ఇంటి సభ్యుల ఓటింగ్‌తో శ్రీముఖి నామినేషన్‌లోకి వెళ్లింది. తరువాత వచ్చిన వితికా-రవిల్లో తక్కువ ఓట్లు రావడంతో రవి నామినేట్‌ అయ్యాడు. వరుణ్‌-రాహుల్‌ సరదాగా చర్చించుకుంటూ.. తన ఓటు రాహుల్‌కే వేస్తానని వరుణ్‌ చెప్పుకొచ్చాడు. ఇంటి సభ్యులు దాదాపు అందరూ రాహుల్‌కు ఓటు వేశారు. దీంతో ఓట్లు తక్కువ రావడంతో వరుణ్‌ నామినేషన్‌లోకి వచ్చాడు. చివరగా వచ్చిన పున్ను-బాబా భాస్కర్‌లో బాబా నామినేట్‌ అయ్యాడు. దీంతో పదోవారానికిగానూ శ్రీముఖి, రవి, వరుణ్‌, బాబా భాస్కర్‌లు నామినేట్‌ అయినట్లు ప్రకటించాడు.

ఎగిరి గంతేసిన పున్ను..
రాహుల్‌ది ఫేక్‌ ఎలిమినేషన్‌ అని ప్రేక్షకులకు తెలుసు. కానీ.. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లకు తెలీదు. అయితే రాహుల్ తిరిగి ఎంట్రీ ఇస్తున్నాడని తెలియడంతో హౌస్‌మేట్స్‌ అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక వితికా, పునర్నవి, వరుణ్‌ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. కోర్ట్‌యార్డ్‌లో కూర్చొని రాహుల్‌ గురించి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే రాహుల్‌ ఎంట్రీ ఇచ్చాడు. తన సోదరి(వితికా) రుచికరమైన భోజనం ఎలా మిస్‌ అవుతానంటూ, బాబా భాస్కర్‌ బ్లాక్‌ షీప్ అని ర్యాప్‌ పాడుతూ.. పున్ను కోసం పాట పాడుకుంటూ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇంట్లోకి వచ్చిన తరువాత పున్నును గట్టిగా హత్తుకున్నాడు. సీక్రెట్‌ రూమ్‌లో ఉంటూ అందర్నీ గమనిస్తూ ఉన్నానని, అందరు మాట్లాడిన మాటలు విన్నానని, బాబా భాస్కర్‌ ఇంకా మాస్క్‌ తీయలేదంటూ చెప్పుకొచ్చాడు.

నామినేషన్‌లోకి వచ్చిన శ్రీముఖి, రవి, వరుణ్‌, బాబా భాస్కర్‌లోంచిఎవరు ఎలిమినేట్‌ అవుతారో చూడాలి. ఇక ఈ వారానికి గానూ బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ ఫన్‌ క్రియేట్‌ చేసేలానే ఉంది. పదో వారంలో కెప్టెన్‌గా ఎవరు ఎన్నికవుతారు? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement