బిగ్‌బాస్‌: శివజ్యోతిని ఎమోషనల్‌గా ఆడుకుంటున్నారా?

Bigg Boss 3 Telugu Sivajyothi Get Emotional By Baba Bhaskar - Sakshi

తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టిన బిగ్‌బాస్‌ హౌస్‌ నామినేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోగా రాహుల్‌, మహేశ్‌, హిమజలు ముగ్గురు ఎలిమినేషన్‌లో ఉన్నారు. ఇక బిగ్‌బాస్‌ ఇచ్చిన ఫన్నీటాస్క్‌ క్రేజీ కాలేజ్‌... గత సీజన్‌ల నుంచి కాపీ కొట్టింది అనడంలో సందేహం లేదు. ఇక ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులందరూ ఇరగదీశారు. లవ్వాలజీ లెక్చరర్‌గా వ్యవహరించిన బాబా భాస్కర్‌ బాగానే కామెడీ పండించాడు. అదే సమయంలో శివజ్యోతిని ఏడిపించాడు కూడా!. మొదట ఏడుపును పంటికిందే బిగపట్టినప్పటికీ చివరికి భోరున ఏడ్చేసింది. తను ఎంత స్ట్రాంగో అందరికీ తెలుసు అంటూనే బాబా... శివజ్యోతిని ఏడిపించాడు. ఇకపోతే గత ఎపిసోడ్‌లోనూ బాబా భాస్కర్‌, శ్రీముఖిలు... శివజ్యోతి గురించి చర్చించుకున్నారు. తను రిలేషన్‌ షిప్స్‌తో వీక్‌ అవుతోందని.. అవి దాటి గేమ్‌లోకి రావాలని కోరుకుంటున్నట్టుగా మాట్లాడుకున్నారు.

శివజ్యోతిని ఏడిపిస్తున్న బాబా భాస్కర్‌

నిజంగా సీజన్‌ ప్రారంభం నుంచి చూసినట్టైతే శివజ్యోతి మొదట రోహిణి, అషూరెడ్డితో బాగానే దోస్తీ చేసింది. షోలో భాగంగా రోహిణి ఇంటిని వీడే సమయం వచ్చినప్పుడు శివజ్యోతి వెక్కివెక్కి ఏడ్చింది. రోహిణి వెళ్లిన తర్వాతి వారానికే అషూ బయటకు వెళ్లాల్సి రావటంతో తనను ఆపటం ఎవరితరం కాలేదు. బిగ్‌బాస్‌ ముగ్గురు స్నేహితులను విడగొట్టినప్పటికీ శివజ్యోతి మరో తోడు వెతుక్కుంది. అలీ రెజాను సొంత తమ్ముడిగా చూసుకుంటూ మురిసిపోయింది. అంతలోనే బిగ్‌బాస్‌ అనూహ్యంగా ఏడోవారంలోనే అలీని ఎలిమినేట్‌ చేశాడు. దీంతో శివజ్యోతి ఇప్పుడు రవితో క్లోజ్‌గా ఉంటోంది. నామినేషన్‌ టాస్క్‌లో కూడా రవి, మహేశ్‌లకు తప్ప ఇంకెవరి కోసం త్యాగం చేయను అని  తేల్చిచెప్పింది. ఇవన్నీ చూస్తుంటే ఆమె నిజంగానే రిలేషన్‌ షిప్స్‌లో ఇరుక్కుపోయిందని, సొంతంగా ఆట ఆడలేకపోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. 

అయితే బాబా భాస్కర్‌ కావాలనే శివజ్యోతి ఫీలింగ్స్‌తో ఆడుకుంటున్నాడని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివజ్యోతిని స్ట్రాంగ్‌ చేయడానికే బాబా గట్టి క్లాస్‌ పీకుతున్నాడని మరికొందరు అంటున్నారు. ఇక బిగ్‌బాస్‌ షో కాస్త డైలీ సీరియల్‌లా మారుతోందని మరికొందరు నిట్టూరుస్తున్నారు. మరి శివజ్యోతి ఈ విషయాన్ని పాజిటివ్‌గా తీసుకుంటుందా? లేక ఎదురు తిరుగుతుందా అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top