బిగ్‌బాస్‌.. గొడవపడ్డ రాహుల్‌-పునర్నవి

Bigg Boss 3 Telugu Rahul Fires On Punarnavi - Sakshi

బిగ్‌బాస్‌ చెప్పిందే శాసనం. ఆయన ఆదేశిస్తే.. అందరూ అది పాటించాల్సిందే. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆయన మాటే శాసనం అవుతుంది. అలాంటి బిగ్‌బాస్‌ ఆదేశాలను బేఖాతరు చేసింది పునర్నవి. అయినా వరుణ్‌ సందేశం బుజ్జగింపులతో చిట్టచివరకు తలొగ్గింది. బిగ్‌బాస్‌ ఆదేశాలను పాటించనని మొండికేసిన పునర్నవి.. చివరకు తలొగ్గి షూ పాలిష్‌ చేయడం, కెప్టెన్‌గా వితికా ఎన్నికవడం.. రాహుల్‌-పునర్నవిల మధ్య గొడవ జరగడం హైలెట్‌గా నిలిచింది.

కెప్టెన్‌గా ఎన్నికైన వితిక
ఎనిమిదో వారంలో బిగ్‌బాస్‌ హౌస్‌ కెప్టెన్‌గా వితికా షెరు ఎన్నికైంది. బరువులెత్తగలవా.. జెండా పాతగలవా అనే ఈ కెప్టెన్సీ టాస్క్‌కు వితికా, శ్రీముఖి, మహేష్‌ పోటీపడగా.. వారికి సహాయం చేసేందుకు వరుణ్‌, రవి, శివజ్యోతిలను ఎంచుకున్నారు. వరుణ్‌ సందేశ్‌ వితికాను, రవి.. శ్రీముఖిని, మహేస్‌.. శివజ్యోతిని ఎత్తుకున్నారు. ఒక సైడ్‌ ఉన్న జెండాలను మరోవైపు పెట్టాలని... అలా ఎండ్‌ ప్లేస్‌ వరకు ఎక్కువ జెండాలను పెడితే వారే కెప్టెన్‌గా ఎన్నికవుతారని తెలిపాడు. ఈ క్రమంలో వరుణ్‌, మహేష్‌లు తొందరగా టాస్క్‌ను పూర్తి చేసేందుకు చాలా కష్టపడ్డారు. అయితే శ్రీముఖిని ఎత్తుకున్న రవికి మాత్రం ఈ టాస్క్‌ను చేయడం మరింత కష్టంగా మారినట్టు కనిపించింది. చివరకు ఈ టాస్క్‌లో అందరికంటే ఎక్కువ జెండాలను పాతి వితికా విన్నర్‌గా నిలిచింది. ఇక కెప్టెన్‌గా ఎన్నికైన వితికా ఆనందానికి అవదుల్లేవు.

పునర్నవి-రాహుల్‌ మధ్య గొడవ
కెప్టెన్సీ టాస్క్‌లో వితికాకు రాహుల్‌ సహాయం చేస్తానని చెబుతూ ఉండగా.. చెయ్యి నొప్పి, కాలు నొప్పి అంటావ్‌ నీకవసరమా? అని పునర్నవి అంది. ఇదే విషయాన్ని టాస్క్‌ అనంతరం వితికా, పునర్నవి, వరుణ్‌ చర్చించుకుంటూ ఉంటే.. రాహుల్‌ మధ్యలో వచ్చి ఫైర్‌ అయ్యాడు. నువ్వెందుకలా అన్నావ్‌ అంటూ పునర్నవిని మందలించాడు. నువ్వు చేయలేవు కాబట్టి అన్నాను అంటూ రివర్స్‌ కౌంటర్‌ వేసింది. ఇలా మాటామాట పెరుగుతూ ఉండగా వితికా.. పునర్నవిని రాహుల్‌కు దూరంగా తీసుకెళ్లింది.

అందరి ముందు తను అలా అనడం తనకు నచ్చలేదంటూ వరుణ్‌తో రాహుల్‌ చెప్పుకొచ్చాడు. మళ్లీ కాసేపయ్యాక కాఫీ ఇచ్చేందుకు వచ్చిన పునర్నవితో రాహుల్‌ సీరియస్‌గానే మాట్లాడాడు. ఇక నేను పునర్నవితో మాట్లాడనంటూ వరుణ్‌తో చెప్పుకొచ్చాడు. మరోవైపు వితికా-పునర్నవిలు కూడా రాహుల్‌ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మనం వస్తే వద్దంటున్నాడు.. అదే వరుణ్‌తో మాట్లాడుతున్నాడంటూ రాహుల్‌ గురించి ముచ్చటించుకున్నారు. మరి వీరి గొడవ కొద్ది క్షణాలే అన్న విషయం అందరికీ తెలిసినా.. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ఏం జరుగనుందో చూడాలి.

హయర్‌ రిఫ్రిజిరేటర్‌ టాస్క్‌ను ఇచ్చిన బిగ్‌బాస్‌.. ఇంటి సభ్యుల్లోంచి ఎవరో ఒకర్ని ఎంచుకోవాలని తెలిపాడు. వారికి ట్రిక్‌ లేదా ట్రీట్‌ను ఇవ్వాల్సి ఉంటుందని.. ట్రిక్‌ అంటే ఐస్‌ క్యూబ్‌ను వారి మీద వేయడం.. ట్రీట్‌ అంటే ఫ్రిజ్‌లో ఉన్న తినుబండారాలను ఇవ్వడమని సూచించాడు. ఇక శ్రీముఖి.. బాబా భాస్కర్‌కు, శిల్పా.. రాహుల్‌కు ట్రిక్‌ను ఎంచుకుని వారి మీద ఐస్‌క్యూబ్స్‌ను వేశారు. మిగతా హౌస్‌మేట్స్‌ అందరూ ట్రీట్‌ ఇచ్చుకున్నారు. ఇలా గురువారం నాటి ఎపిసోడ్‌ ఆనందంగా ముగిసింది.

  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

21-09-2019
Sep 21, 2019, 10:37 IST
తమిళనాడు ,పెరంబూరు: ఇప్పుడు తమిళం, తెలుగునాట వాడివేడిగా సాగుతున్న చర్చ బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో గురించేనంటే అతిశయోక్తి కాదేమో....
20-09-2019
Sep 20, 2019, 22:58 IST
ఆరవై రోజుల పండగ అంటూ కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకొచ్చిన బిగ్‌బాస్‌.. కొందరికి ఆనందాన్ని, మరికొందరికి బాధను మిగిల్చాడు. ఇదంతా...
20-09-2019
Sep 20, 2019, 09:20 IST
బిగ్‌బాస్‌ ఇచ్చిన క్రేజీ కాలేజీ టాస్క్‌లో బెస్ట్‌ టీచర్‌గా బాబా భాస్కర్‌, బెస్ట్‌ స్టూడెంట్‌గా మహేశ్‌ ఎంపికయ్యారు. ‘ప్రచారమే ఆయుధం’ అనే కెప్టెన్సీ టాస్క్‌లో బాబా...
19-09-2019
Sep 19, 2019, 15:08 IST
నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌ కొన్ని మలుపులు, మరికొన్ని ట్విస్టులతో నడుస్తోంది. షో ప్రారంభం నుంచి ఇప్పటివరకు...
19-09-2019
Sep 19, 2019, 12:11 IST
చుక్కలనంటే రేటింగ్స్‌తో ప్రారంభమైన బిగ్‌బాస్‌ నిర్వాహకులకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన షో  పైన పటారం.. లోన లొటారం అన్నట్టుగా మారింది. బిగ్‌బాస్‌...
19-09-2019
Sep 19, 2019, 08:32 IST
బిగ్‌బాస్‌.. ఉత్కంఠభరితమైన నామినేషన్‌తో ప్రారంభమైన తొమ్మిదో వారం సరదాగా కొనసాగుతోంది. అయితే బాబా భాస్కర్‌, రాహుల్‌ అందరి ముందు తనను కామెంట్‌ చేశారని...
18-09-2019
Sep 18, 2019, 18:20 IST
బిగ్‌బాస్‌ తొమ్మిదో వారానికి గాను నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. ఈ వారం నామినేషన్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌, హిమజా, మహేశ్‌లు ఉన్నారు....
18-09-2019
Sep 18, 2019, 15:14 IST
తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టిన బిగ్‌బాస్‌ హౌస్‌ నామినేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోగా రాహుల్‌, మహేశ్‌, హిమజలు ముగ్గురు ఎలిమినేషన్‌లో ఉన్నారు. ఇక బిగ్‌బాస్‌ ఇచ్చిన...
17-09-2019
Sep 17, 2019, 13:23 IST
తొమ్మిదో వారానికిగానూ బిగ్‌బాస్‌ చేపట్టిన నామినేషన్‌ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. గత సీజన్‌లో మాదిరిగానే నిర్వహించిన బిగ్‌బాస్‌ కొన్ని మార్పులు...
17-09-2019
Sep 17, 2019, 11:38 IST
బిగ్‌బాస్‌ సెకండ్‌ సీజన్‌ పాపులర్‌ కావడానికి ముఖ్య కారణమైన కంటెస్టెంట్‌ కౌశల్‌. హౌస్‌లో ఉన్నప్పుడు ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడో.....
17-09-2019
Sep 17, 2019, 11:07 IST
గత సీజన్లలో వచ్చిన నామినేషన్‌ టాస్క్‌నే ఈ సీజన్‌లోనూ బిగ్‌బాస్‌ మక్కీకి మక్కీ దించాడు. ఇక ఇంటిసభ్యులందరూ ఎలిమినేషన్‌ నుంచి గట్టెక్కడానికి అరక్షణమైనా ఆలోచించకుండా ఒకరికోసం...
17-09-2019
Sep 17, 2019, 10:01 IST
ఎనిమిది వారాలను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకున్న బిగ్‌బాస్‌ షో.. తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టేసింది. అయితే ఇప్పటివరకు ఏడు ఎలిమినేషన్స్‌, రెండు...
17-09-2019
Sep 17, 2019, 08:34 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల త్యాగాలన్నీ ఒకెత్తు అయితే పునర్నవి రాహుల్‌ను హగ్‌ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం...
16-09-2019
Sep 16, 2019, 22:50 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో తొమ్మిదో వారంలో చేపట్టిన నామినేషన్‌ ప్రక్రియ ఆద్యంతం ఉత్కంఠగా మారింది.  ఈ క్రమంలో గార్డెన్‌ ఏరియాలో ఓ...
16-09-2019
Sep 16, 2019, 20:06 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో తొమ్మిదో వారానికి గానూ చేపట్టే నామినేషన్‌ ప్రక్రియ ఆసక్తికరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వారంలో ఎవరు నామినేషన్స్‌లోకి...
16-09-2019
Sep 16, 2019, 18:05 IST
గత సీజన్‌లో ఇచ్చిన టాస్క్‌లనే కొద్దిగా మార్పులు, చేర్పులు చేసి ఇస్తుంటాడు బిగ్‌బాస్‌. రెండో సీజన్‌లో  నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా...
16-09-2019
Sep 16, 2019, 17:21 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో.. నామినేషన్‌లో ఉండటం అనేది ఎంతటి వారికైనా కునుకు లేకుండా చేస్తుంది. హౌస్‌మేట్స్‌లో అప్పటి వరకు ఉన్న ప్రవర్తనకు...
15-09-2019
Sep 15, 2019, 22:23 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో వీకెండ్‌ సందడిగా గడిచింది. వీకెండ్‌లో వచ్చిన నాగ్‌.. హౌస్‌మేట్స్‌ చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేశాడు....
15-09-2019
Sep 15, 2019, 20:26 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో వారం గడిచిపోయేందుకు వచ్చేసింది. నిన్నటి వీకెండ్‌ ఎపిసోడ్‌లో అందరి లెక్కలు సరిచేసిన నాగ్‌.. విశ్వరూపం చూపించాడు....
14-09-2019
Sep 14, 2019, 22:58 IST
బిగ్‌బాస్‌ను ఎదురించిన పునర్నవి, మహేష్‌లపై నాగ్‌ ఫైర్‌ అవ్వడం, శ్రీముఖికి వార్నింగ్‌ ఇవ్వడం, టాస్క్‌లను అర్థం చేసుకుని ఆడాలని శిల్పాకు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top