బిగ్‌బాస్‌ దెబ్బకు దిగొచ్చిన పునర్నవి | Bigg Boss 3 Telugu Punarnavi Obeyed Bigg Boss Rules | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ దెబ్బకు దిగొచ్చిన పునర్నవి

Sep 12 2019 6:56 PM | Updated on Sep 12 2019 6:59 PM

Bigg Boss 3 Telugu Punarnavi Obeyed Bigg Boss Rules - Sakshi

బిగ్‌బాస్‌ అని ఊరికే అనలేదు. బిగ్‌బాస్‌ హౌస్‌లో తన ఆదేశాలను ధిక్కరించేవారిని ఊరికే వదిలిపడతాడా? తన ముందు తలొంచేలా చేస్తాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఒక్కసారి ప్రవేశించాక అతని మాటే శాసనమవుతుంది. ఎవరైనా ఎదురుతిరిగిన ఉపేక్షించడు. కొన్ని పరిస్థితుల్లో బిగ్‌బాస్‌ మౌనంగా ఉన్నా.. చివరకు తన మాటే శిరోదార్యమవుతుంది. ఇంటి సభ్యులందరూ వాటిని పాటించవలసి ఉంటుంది. 

ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌లో భాగంగా పునర్నవి బిగ్‌బాస్‌ ఆదేశాలనే ధిక్కరించిన సంగతి తెలిసిందే. నేరుగా నామినేట్‌ చేస్తానని బిగ్‌బాస్‌ హెచ్చరించినా.. పునర్నవి లెక్కచేయలేదు. ఇంట్లోంచి వెళ్లిపోయినా పర్లేదు గానీ బిగ్‌బాస్‌ ఇచ్చిన పనిష్మెంట్‌ను అంగీకరించేది లేదని.. ఇవీ ఓ టాస్కులా.. అన్నివేళలా బిగ్‌బాస్‌ కరెక్ట్‌ కాదంటూ.. కావాలంటే ఈ టాస్కులను బిగ్‌బాస్‌నే ఆడుకోమని ఫైర్‌ అయింది.

అయితే తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోను బట్టి.. దేవుడా అంటూ పునర్నవి దిగొచ్చినట్లు కనిపిస్తోంది. మొత్తానికి బిగ్‌బాస్‌ తన పంతాన్నే నెగ్గిచ్చుకున్నట్లు తెలుస్తోంది. పునర్నవి చేత షూ పాలిష్‌ చేయిస్తున్నాడు. దీనికి తోడు బాబా భాస్కర్‌ తోడయ్యాడు. అది బాగా పాలిష్‌ చేయలేదంటూ పునర్నవి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ టాస్క్‌ అయ్యాక మీ పని చెబుతా అంటూ బాబాను బెదిరించసాగింది. మామూలోడివి కాదు బిగ్‌బాస్‌ అని పునర్నవి చేత అనిపించేలా చేశాడు. మరి పునర్నవి తన పంతం వదులుకోవడానికి కారణమేంటన్నది చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement