బిగ్‌బాస్‌.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌

Bigg Boss 3 Telugu Housemates Performance In Sixth Weekend - Sakshi

బిగ్‌బాస్‌ హోస్ట్‌గా రమ్యకృష్ణ అదరగొట్టింది. ఆరో వారాంతానికి నాగార్జున అందుబాటులో లేనందున స్పెషల్‌ గెస్ట్‌తో షోను నడిపించారు. ఇక ఫస్ట్‌ టైమ్‌ తన హోస్టింగ్‌తో హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియెన్స్‌ను రమ్యకృష్ణ ఆకట్టుకుంది. హౌస్‌లో అన్యాయానికి గురైన మహిళలకు, న్యాయం చేసింది. తన రాజ్యంలో మహిళల పట్ల చిన్న చూపు తగదన్నట్లు తీర్పునిచ్చింది. వరుణ్‌ సందేశ్‌ మొహంపై కాఫీ పోయడం, రాహుల్‌ బట్టలను కత్తిరించడం, రవికి సంబంధించిన బెడ్‌ను నీటితో తడపటంలాంటి ఆదేశాలను జారీ చేసింది.

ఇక నేటి ఎపిసోడ్‌లో మరో ఆట ఆడించినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో వైరల్‌ అవుతోంది. సీన్‌ చేయండి అనే ఈ గేమ్‌లో శ్రీముఖి కాస్తా.. చంద్రముఖిగా మారిపోయింది. ఇదే వరుసలో రాహుల్‌-పునర్నవి లవ్‌ ట్రాక్‌ కూడా బయటపడనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రోమోలో వీరిద్దరే హైలెట్‌గా నిలిచారు. ఇక వితికా తన బాధను వ్యక్తపరిచేలా నటిస్తుంటే.. వరుణ్‌ ఆ సీన్‌ను కామెడీ చేయడంతో హౌస్‌మేట్స్‌ అంతా పగలబడి నవ్వుకుంటున్నారు. హోస్ట్‌గా ఉన్న రమ్యకృష్ణ.. హౌస్‌మేట్స్‌ను కలిసేందుకు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంటర్‌ అయింది. అక్కడా కూడా పంచ్‌లు వేస్తూ.. బాబా భాస్కర్‌ను బెదిరిస్తూ..ఆటపట్టిస్తూ.. ఎంటర్‌టైన్‌ చేసినట్లు కనిపిస్తోంది. 

ఆరోవారంలో ఎలిమినేషన్‌ లేదనే విషయం దాదాపుగా ఖరారైపోయింది. అయితే మరో వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. గతంలో యాంకరింగ్‌ చేసి క్రేజ్‌ను సొంతం చేసుకున్న శిల్పా చక్రవర్తి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. గత వారంలో కూడా ఇలాగే ఈషా రెబ్బా హౌస్‌లోకి ఎంటర్‌ అవుతుందనే వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే అవన్నీ వట్టి రూమర్స్‌గానే మిగిలాయి. మరి ప్రస్తుతం వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచిచూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top