బిగ్‌బాస్‌: పునర్నవి లవ్‌ ట్రాక్‌ రాహుల్‌తో కాదా?

Bigg Boss 3 Telugu Chalo India Task For Housemates - Sakshi

ఒకరోజు గొడవలు.. మరో రోజు సరదాలు.. రోజు విడిచి రోజు ఇదే తతంగం. ప్రస్తుతం బిగ్‌బాస్‌ సీజన్‌ ఈ ఫార్ములా మీదే నడుస్తోంది. ఒకరోజు అరుపులు పెడబొబ్బలతో ఎపిసోడ్‌ సాగింది అంటే కచ్చితంగా తర్వాతి ఎపిసోడ్‌ సరదాగా జోష్‌గా సాగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. నిన్న హీట్‌ ఎక్కిన ఇంటిని నేడు కూల్‌ చేసే పనిలో ఉన్నాడు బిగ్‌బాస్‌. అందులో భాగంగానే ఇంటి సభ్యుల చేత ‘చలో ఇండియా’ టాస్క్‌ ఆడించనున్నాడు. ఇందులో విస్తుగొల్పే విషయమేంటంటే రవి-పునర్నవిని హనీమూన్‌ జంటగా పేర్కొన్నాడు. దీంతో రాహుల్‌ పక్కలో బాంబు పడ్డట్టయింది. 

ప్రస్తుతం ఈ విషయాన్ని రాహుల్‌ గట్టి మనసుతో లైట్‌ తీసుకున్నా టాస్క్‌లో వారి తీరును చూసి ఎలా జీర్ణించుకుంటాడో.. అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. రాహుల్‌ను సేవ్‌ చేసి పునర్నవి ఎలిమినేషన్‌కు వెళ్లటంతో ఇప్పుడిప్పుడే వీరి లవ్‌ ట్రాక్‌ కాస్త గాడిలో పడుతుందనే సమయానికి అనూహ్యంగా పునర్నవి భర్తగా రవిని నియమించాడు. మరి దీని తర్వాతి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో..! స్నేహితురాలి కన్నా ఎక్కువైన పునర్నవి పక్కన వేరేవాళ్లను చూసి రాహుల్‌ తట్టుకుంటాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో రాహుల్‌కు మంచి అవకాశం చేజారిపోయిందని రాహుల్‌ ఫ్యాన్స్‌ గుస్సా అవుతున్నారు.

ఇక చలో ఇండియా టాస్క్‌ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించేలా కనిపిస్తోంది. బాబా భాస్కర్‌ను చాయ్‌ అమ్ముకునే వ్యక్తిలా, రాహుల్‌, వరుణ్‌ ట్రైన్‌ డ్రైవర్‌, కండక్టర్‌లుగా అవతారం ఎత్తనున్నారు. ఇక ప్రోమో చూస్తే టాస్క్‌లో అందరూ విజృంభించి నటించినట్టే కనిపిస్తోంది. మరోవైపు బిగ్‌బాస్‌ ఆరోవారంలోకి ఎంటరై రెండు రోజులు కావస్తోంది. కానీ ఇప్పటివరకు కెప్టెన్సీ టాస్క్‌ ఆడించలేదు. మరి ప్రస్తుతం ఇచ్చిన గేమ్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చినవారిని కెప్టెన్‌గా ఎంపిక చేయనున్నాడా లేక శివజ్యోతినే కెప్టెన్‌గా కంటిన్యూ చేయనున్నాడా లేక అందుకు మరో పథకం సిద్ధం చేస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top