బాబా భాస్కర్‌ వెకిలి కామెడీ.. నెటిజన్లు ఫైర్‌

Bigg Boss 3 Telugu: Baba Bhaskar Vulgar Comedy On Srimukhi Mother - Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లోకి ఏడుగురు అతిథులు వచ్చారు. ఇంటి సభ్యులు వారికి సకల మర్యాదలు చేసి ఏడు స్టార్లను సంపాదించుకున్నారు. అయితే వచ్చిన అతిథుల్లో మెజారిటీ జనాలు వరుణ్‌ బామ్మ అదుర్స్‌ అంటున్నారు. తన కామెడీ టైమింగ్‌తో, పంచులతో హుషారెత్తించింది అంటూ బామ్మకు జై కొడుతున్నారు. ఇక రాహుల్‌ తల్లి సుధారాణి.. తన కొడుకుకు, శ్రీముఖికి మధ్య ఉన్న గొడవలను ఏమాత్రం పట్టించుకోకుండా రాములమ్మ అల్లరి ఎంతో ఇష్టమని పాజిటివ్‌గా మాట్లాడింది. ఇక చివరగా శ్రీముఖి.. తన తల్లిని కలుసుకోడానికి ఆమెను బిగ్‌బాస్‌ మూడు చెరువుల నీళ్లు తాగించాడు. శ్రీముఖి తల్లి లత ఇంట్లోకి వచ్చినట్టే వచ్చి వెళ్లిపోగా శ్రీముఖి గుండె పగిలేలా రోదించింది.

ఇన్ని ట్విస్టుల మధ్య మళ్లీ ఆమె ఇంట్లోకి ప్రవేశించగా రాహుల్‌ను కాస్త సున్నితంగానే హెచ్చరించింది.  మరోవైపు శ్రీముఖి లేనిదే బిగ్‌బాస్‌ హౌస్‌ లేదంటూ ఆమెను ఆకాశానికి ఎత్తింది. రాహుల్‌ తల్లి అంత పాజిటివ్‌గా మాట్లాడితే శ్రీముఖి తల్లి మాత్రం అలా రాహుల్‌ను వేలెత్తి చూపడం ఏం బాగోలేదంటూ కొంతమంది ఆమె తీరును తప్పుపడుతున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే నిన్నటి ఎపిసోడ్‌లో బాబా భాస్కర్‌ ప్రవర్తించిన విధానం ఏమీ బాగోలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అతని తీరును తప్పుపడుతూ సోషల్‌ మీడియాలో ఎండగడుతున్నారు. శ్రీముఖి తల్లి లతను ఉద్దేశించి ఆయన మాట్లాడిన తీరును తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.

ఆమెను హగ్‌ చేసుకోడానికి అన్నట్టుగా బాబా భాస్కర్‌ దగ్గరికెళితే శివజ్యోతి ఆయనను పక్కకు లాక్కెళ్లింది. సిగ్గులేదా అంటూ బాబాను శివజ్యోతి తిట్టిపోసింది. పైగా బాబా శ్రీముఖి తల్లిని ఉద్దేశించి.. సేమ్‌ జిరాక్స్‌.. జై రామకృష్ణ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆమె కోసం వస్తా నీ వెనక.. అని పాటలు పాడటం వెగటు పుట్టించిందని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఆమెకు మోకాళ్లపై కూర్చుని టీ ఇస్తూ అతిగా ప్రవర్తించడం చిరాకు పుట్టించదని సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. శ్రీముఖి ఆమె తల్లిని ఎత్తుకున్న సమయంలోనూ ‘ఏమైనా హెల్ప్‌ చేయాలా..’ అంటూ వెకిలిగా మాట్లాడటం ఆయన దిగజారిన కామెడీకి అద్దం పట్టాయని విమర్శిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో బాబా ప్రవర్తనను చూసిన నెటిజన్లు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అలాగే బాబా ప్రవర్తనకు ఇంటి సభ్యులు సైతం షాకైనట్టుగా తెలుస్తోంది.  మరోవైపు బాబా అభిమానులు మాత్రం ఇదంతా కేవలం కామెడీయే అని వెనకేసుకొస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top