ప్రేమలో పడ్డాను | Bhavana fall in Love | Sakshi
Sakshi News home page

ప్రేమలో పడ్డాను

Feb 15 2014 12:48 AM | Updated on Sep 2 2017 3:42 AM

ప్రేమలో పడ్డాను

ప్రేమలో పడ్డాను

నేను ప్రేమలో పడ్డానని అంటోంది నటి భావన. మాలీవుడ్‌కు చెందిన ఈ బ్యూటీ కోలీవుడ్‌లో చిత్తిరం పేసుదడి చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసింది.

నేను ప్రేమలో పడ్డానని అంటోంది నటి భావన. మాలీవుడ్‌కు చెందిన ఈ బ్యూటీ కోలీవుడ్‌లో చిత్తిరం పేసుదడి చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత జయంకొండాన్, దీపావళి తదితర చిత్రాలు చేసినా ఆశించిన స్థాయికి చేరుకోలేదు. దీంతో టాలీవుడ్‌పై దృష్టి సారించింది. అక్కడ వరుసగా కొన్ని చిత్రాలు చేసినా అనుష్క, కాజల్ అగర్వాల్ వంటి అందాల తారల ధాటికి నిలబడలేకపోయింది. మళ్లీ మాతృగడ్డకే తిరుగు ప్రయూణమైంది. ప్రస్తుతం మలయాళం, కన్నడం చిత్రాల్లో నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ చిత్ర పరిశ్రమకు చెందిన ఒకరి ప్రేమలో పడినట్లు వీరి షికారు చూసిన వారు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రేమ, దోమ లేదంటూ తప్పించుకుంటూ వచ్చిన భావన తాజాగా ప్రేమలో పడినట్లు అంగీకరించింది.
 
 దీని గురించి ఆమె తెలుపుతూ మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమిస్తున్నానని, ఆయన చిత్ర పరిశ్రమకు చెందిన వారేనని చిన్న క్లూ కూడా ఇచ్చింది. రెండేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి ఇప్పుడు ప్రేమికులమయ్యూమని తెలిపింది. తన గత జీవితం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి ఆయనని అంటోంది. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రేమజంట త్వరలో గురువాయూర్ ఆలయంలో వివాహం చేసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు మాలీవుడ్ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement