సీరియస్ కామెడీ! | Bhallaladeva comedy movie | Sakshi
Sakshi News home page

సీరియస్ కామెడీ!

Sep 13 2015 10:07 PM | Updated on Sep 3 2017 9:20 AM

సీరియస్ కామెడీ!

సీరియస్ కామెడీ!

అతని పేరు భల్లాలదేవ. పేరు పవర్‌ఫుల్‌గా ఉంది కదా.. చాలా సీరియస్ టైప్ అనుకోకండి.

అతని పేరు భల్లాలదేవ. పేరు పవర్‌ఫుల్‌గా ఉంది కదా.. చాలా సీరియస్ టైప్ అనుకోకండి. ఫుల్ సరదా మనిషి. రెండు ఊళ్ల మధ్య తగాదాలను తీర్చడానికి, తన ప్రేమను గెల్చుకోవడానికి అతనేం చేశాడనే కథతో రూపొందిన తమిళ చిత్రం ‘దేశింగు రాజా’. విమల్, బిందుమాధవి జంటగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘భల్లాలదేవ’ పేరుతో నిర్మాత  రావిపాటి సత్యనారాయణ తెలుగులోకి విడుదల చేస్తున్నారు. ఎళిల్ దర్శకుడు.

ఈ నెల 24న విడుదల కానుంది. ‘‘రీమేక్ చేయడానికి దమ్మున్న కథ ఇది. మంచి ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది’’ అని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.  నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఆద్యంతం వినోదభరితంగా సాగిన ఈ చిత్రం తమిళంలో లానే తెలుగులో మంచి విజయం సాధిస్తుంది. ఇందులో హీరో పాత్ర అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇమాన్, సాహిత్యం: వనమాలి, మాటలు: కృష్ణతేజ.

Advertisement
 
Advertisement
Advertisement