రేపే రాక్షసుడు ఫస్ట్‌లుక్‌

Bellamkonda Sai Sreenivas Rakshasudu First Look On 6th April - Sakshi

సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా.. వరుసగా చిత్రాలను చేస్తూ ఉన్నాడు యువహీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. తాజాగా కవచం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఈ హీరో.. సీత చిత్రంలో త్వరలోనే మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఈ హీరో ఓ రీమేక్‌ చిత్రంలో కూడా నటించనున్నాడన్న సంగతి తెలిసిందే.

కోలీవుడ్‌ హిట్‌ మూవీ రాక్షసన్‌ను.. తెలుగులో రాక్షసుడుగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ కూడా శరవేగంగా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను రేపు విడుదల చేయనున్నట్లు.. ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్‌. ఈ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. సైకో కిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అనుపమా పరమేశ్వరణ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రైడ్‌, వీర ఫేమ్‌ రమేష్‌ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top