‘రాక్షసుడు’ టీజర్‌ వచ్చేస్తోంది

Bellamkonda Sai Sreenivas Rakshasudu Movie Teaser On 1st June - Sakshi

ఈ ఏడాది కవచం, సీత చిత్రాలతో పలకరించిన బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన సీత సినిమా కాస్త పర్వాలేదనిపించినా.. మంచి విజయాన్ని మాత్రం నమోదు చేయలేకపోయింది. ఇక ఇదే ఏడాది మరో చిత్రంతో ఈ హీరో పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.

తమిళ హిట్‌ చిత్రం రాక్షసన్‌ను తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుపమా పరమేశ్వరణ్‌ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె విడుదల చేసిన ‘రాక్షసుడు’ టైటిల్‌ లోగోకు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేయనున్నుట్లు చిత్రబృందం ప్రకటించింది. జూన్‌ ఒకటో తేదీన ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి గిబ్రాన్‌ సంగీతాన్ని అందిస్తుండగా.. రమేష్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top