101వ సినిమా ఎవరితో..? | Bala krishna 101 movie with Sv Krishna reddy | Sakshi
Sakshi News home page

101వ సినిమా ఎవరితో..?

Dec 27 2016 4:21 PM | Updated on Sep 4 2017 11:44 PM

101వ సినిమా ఎవరితో..?

101వ సినిమా ఎవరితో..?

నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. అంఖడ భారతాన్ని పరిపాలించిన తెలుగు చక్రవర్తి శాతకర్ణి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా

నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. అంఖడ భారతాన్ని పరిపాలించిన తెలుగు చక్రవర్తి శాతకర్ణి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రం తరువాత బాలకృష్ణ చేయబోయే సినిమా ఏంటి..? అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది.

బాలయ్య 101వ సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు అనే సందేశాత్మక చిత్రం చేస్తాడని భావించారు. అదే సమయంలో యువ దర్శకుడు అనీల్ రావిపూడితో రామారావు గారు అనే సినిమా కూడా ప్రధానంగా వినిపించింది. తాజాగా మరో షాకింగ్ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. చాలా ఏళ్ల కిందట బాలయ్యతో 'టాప్హీరో' లాంటి ఫ్లాప్ సినిమా తీసిన ఎస్ వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ.. ఓ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతానికి ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా.. వారాహి చలనచిత్ర బ్యానర్లో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement