'బాబు బంగారం' సెన్సార్ పూర్తి | Babu Bangaram completes censor formalities | Sakshi
Sakshi News home page

'బాబు బంగారం' సెన్సార్ పూర్తి

Aug 5 2016 7:59 PM | Updated on Sep 4 2017 7:59 AM

'బాబు బంగారం' సెన్సార్ పూర్తి

'బాబు బంగారం' సెన్సార్ పూర్తి

'భలే భలే మగాడివోయ్‌' సినిమాతో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన మారుతి.. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం 'బాబు బంగారం'.

'భలే భలే మగాడివోయ్‌' సినిమాతో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన మారుతి.. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం 'బాబు బంగారం'. టీజర్‌, ట్రైలర్‌ లతో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా శుక్రవారం  సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ టీమ్ ఈ సినిమాకు 'యూ/ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. దాంతో ఆగష్టు 12న సినిమా విడుదలకు సిద్ధమైనట్టే.

ఈ సినిమాలో వెంకీ.. కామెడీ టచ్ ఉన్న పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. వినోదాత్మకంగా మలచిన ఆయన పాత్ర సినిమాకే హైలైట్ అవుతుందని టాక్. జిబ్రాన్ సంగీత దర్శకత్వంలో విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.

Advertisement
 
Advertisement
Advertisement