బాబా భాస్కర్‌-జాఫర్‌ల మధ్య గొడవ | Baba Bhaskar And Jaffar Fighting Each Other | Sakshi
Sakshi News home page

బాబా భాస్కర్‌-జాఫర్‌ల మధ్య గొడవ

Jul 26 2019 6:29 PM | Updated on Jul 26 2019 7:15 PM

Baba Bhaskar And Jaffar Fighting Each Other - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ చేస్తున్నది ఎవరైనా ఉన్నారు అంటే అది బాబా భాస్కర్‌,జాఫర్‌లు మాత్రమే. వీరిద్దరి ద్వయం చేసే చేష్టలు, మాటలు వీక్షకులకు కాస్త రిలీఫ్‌ దొరికినట్టు అనిపిస్తోంది. జాఫర్‌కు వ్యాయామం ఎలా చేయాలో డైరెక్షన్‌ ఇవ్వడం, డ్యాన్సులు నేర్పించడం, ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం ఇలా ప్రతీ దాంట్లో ఫన్‌ ఉంటోంది. నిన్నటి ఎపిసోడ్‌ మొత్తం గొడవలతో నిండినా.. వీరిద్దరు కలిసి చేసిన బాహుబలి స్పూఫ్‌ కాస్త ఫన్‌ క్రియేట్‌ చేసింది

అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమో కాస్త వైరల్‌ అయ్యేలా కనిపిస్తోంది. ఈ ప్రోమోలో బాబా భాస్కర్‌, జాఫర్‌లు ఇద్దరూ కలిసి డ్యాన్సులు, పాటలు పాడుకుంటూ ఉన్నారు. డ్యాన్స్‌ మూమెంట్స్‌ చేస్తూ ఉండగా తననే చూడాలని అక్కడ చూడకూడదు, హేమ వైపు చూడకూడదు అనడం, పాట పాడటంలో తప్పు దొర్లితే సరిచేయటం,  గొడవలు లేకుండా ఇలా ఉంటేనే బాగుంది, లేదంటే గొడవలు పెట్టుకోవడం మళ్లీ కొద్దిసేపటికే నవ్వుకోవడం అంటూ జాఫర్‌ కామెంట్‌ చేయడం, చివరగా.. జాఫర్‌ను అమర్యాదగా (రా) సంభోదించడంతో ఆయన సీరియస్‌ కావడం హైలెట్‌గా నిలిచాయి. మరి నిజంగానే వారిద్దరికి గొడవ జరిగిందా? లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే.

చదవండి నా భార్యకు రెస్పెక్ట్‌ ఇచ్చి మాట్లాడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement