ఆ ఆరుగురు ఎలా డిసైడ్ చేస్తారు? | 'Baahubali' director SS Rajamouli comes in support of 'Udta Punjab' | Sakshi
Sakshi News home page

ఆ ఆరుగురు ఎలా డిసైడ్ చేస్తారు?

Jun 12 2016 11:04 PM | Updated on Sep 27 2018 8:55 PM

ఆ ఆరుగురు ఎలా డిసైడ్ చేస్తారు? - Sakshi

ఆ ఆరుగురు ఎలా డిసైడ్ చేస్తారు?

ఒక తండ్రి, తల్లి... వాళ్లకన్నా ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే.. ఆ ఇంటి పెద్ద తమ కుటుంబ సభ్యులు ఎలాంటి సినిమాలు చూడాలో?

‘‘ఒక తండ్రి, తల్లి... వాళ్లకన్నా ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే.. ఆ ఇంటి పెద్ద తమ కుటుంబ సభ్యులు ఎలాంటి సినిమాలు చూడాలో? ఏవి చూడకూడదో నిర్ణయిస్తారు. ఆరుగురు వ్యక్తులు ఉన్న ఓ బోర్డ్ కన్నా నిర్ణయం తీసుకోవడంలో కుటుంబ సభ్యులే మిన్న’’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. హిందీ చిత్రం ‘ఉడ్తా పంజాబ్’కి సెన్సార్ బోర్డ్ 89 కట్స్ చెప్పడంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. భాషా భేదం లేకుండా ‘ఉడ్తా పంజాబ్’కు మద్దతుగా నిలుస్తున్నారు.

‘‘దేశంలో ఉన్న 130 కోట్ల మంది జనాభా ఎలాంటి సినిమాలు చూడాలో.. ఎలాంటివి చూడకూడదో ఆరుగురు వ్యక్తులు ఎలా నిర్ణయిస్తారు? నా మద్దతు ఎప్పుడూ ఫిలిం మేకర్స్ పక్షానే ఉంటుంది’’ అని రాజమౌళి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement