సూపర్‌ హీరోలు దిగిపోతున్నారు | Avatar director James Cameron disses Avengers Infinity War, gets slammed by fans | Sakshi
Sakshi News home page

సూపర్‌ హీరోలు దిగిపోతున్నారు

Apr 23 2018 12:50 AM | Updated on Apr 23 2018 12:50 AM

Avatar director James Cameron disses Avengers Infinity War, gets slammed by fans - Sakshi

ఇంకొక్క మూడు రోజుల్లో కమర్షియల్‌ సినిమాలకు బాబు లాంటి సినిమా ‘అవెంజర్స్‌ : ఇన్ఫినిటీ వార్‌’ థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మార్వెల్‌ కామిక్స్‌ సూపర్‌ హీరో పాత్రలన్నీ ఒకే సినిమాలో, ఒకేసారి కనిపించే సంబరం కావడంతో సాధారణంగానే ‘అవెంజర్స్‌’కు అభిమానుల్లో పిచ్చి క్రేజ్‌ ఉంది. దీనికి తోడు ఇప్పటికే ట్రైలర్‌ అభిమానులకు ఇవ్వాల్సిన కిక్‌ అంతా ఇచ్చేసింది. ట్రైలరే ఇలా ఉంటే ఇంక సినిమా ఎలా ఉంటుందో అని ఇప్పట్నుంచే అభిమానులు టికెట్లు బుక్‌ చేస్కోవడం మొదలుపెట్టేశారు. ఇండియాలోనూ అవెంజర్స్‌ సిరీస్‌కు లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే ఇండియాలోనూ ఈ శుక్రవారం (ఏప్రిల్‌ 27న) భారీ ఎత్తున అవెంజర్స్‌ విడుదలవుతోంది. కెప్టెన్‌ అమెరికా, ఐరన్‌మేన్, స్పైడర్‌మేన్‌ లాంటి సూపర్‌ హీరో క్యారెక్టర్స్‌ సినిమా అంతా కనిపించనున్నాయి. అడుగడుగునా యాక్షనే! ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మొదలైపోయాయి. ఫస్ట్‌ వీకెండ్‌కే ఈ సినిమా 250 మిలియన్‌ డాలర్లు (సుమారు 1,600 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుందని ట్రేడ్‌ అంచనా వేస్తోంది. పాజిటివ్‌ టాక్‌గనక వస్తే అవెంజర్స్‌ను బాక్సాఫీస్‌ వద్ద ఎవ్వరూ ఆపలేరని టాక్‌ వస్తోంది. మరి ఇన్ని అంచనాల మధ్య వస్తోన్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement