సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేశా! | Asin not to work after marriage | Sakshi
Sakshi News home page

సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేశా!

Apr 5 2016 10:54 PM | Updated on Sep 3 2017 9:16 PM

సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేశా!

సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేశా!

ఇటీవలే పెళ్ళయిన సినీ కథానాయిక అసిన్ మళ్లీ సినిమాల్లోకి రానున్నారా?

 ఇటీవలే పెళ్ళయిన సినీ కథానాయిక అసిన్ మళ్లీ సినిమాల్లోకి రానున్నారా? త్వరలో ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ఇవి సోమవారం వరకూ మీడియాలో వచ్చిన వార్తలు. వ్యాపారవేత్త రాహుల్ శర్మను పెళ్లాడాక అసిన్ మీడియాకు దూరంగా ఉంటున్నారు.
 
  దాంతో, కొన్ని రోజులుగా అసిన్ మీద రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. చివరకు అసిన్ వీటిని కొట్టిపారేశారు. ‘‘నేను పెళ్లికి ముందు ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేసేశాను. చివరికి నేను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న బ్రాండ్స్‌కు సంబంధించిన యాడ్స్ నుంచి కూడా తప్పుకున్నాను. ప్రస్తుతానికి నా చేతిలో సినిమాల్లేవు. ఇప్పటి వరకూ మీడియాలో నా సినిమాల గురించి వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవే’’ అని అసిన్ తేల్చిచెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement