
జనవరి 23న పెళ్లి
రెండేళ్లుగా ప్రేమిస్తున్న మైక్రోమ్యాక్స్ సంస్థ అధినేత రాహుల్ శర్మతో హీరోయిన్ అసిన్ వివాహం రానున్న జనవరి 23న
రెండేళ్లుగా ప్రేమిస్తున్న మైక్రోమ్యాక్స్ సంస్థ అధినేత రాహుల్ శర్మతో హీరోయిన్ అసిన్ వివాహం రానున్న జనవరి 23న ఢిల్లీలో జరగనుంది. వీరిద్దరి ప్రేమాయణం పెద్దలకు తెలియడం, వారు వారి పెళ్లికి పచ్చజెండా ఊపడంతో కొంత కాలంగా నటనకు అసిన్ ఫుల్‌స్టాప్ పెట్టేశారు. అంతకు ముందు అంగీకరించిన చిత్రాలు, వాణిజ్య ప్రకటనలను పూర్తి చేసేశారు.