సొంత ఇంట్లో...సహజీవనం?! | Are Nayanthara and Vignesh Shivan living together? | Sakshi
Sakshi News home page

సొంత ఇంట్లో...సహజీవనం?!

Dec 1 2016 11:34 PM | Updated on Sep 4 2017 9:38 PM

సొంత ఇంట్లో...సహజీవనం?!

సొంత ఇంట్లో...సహజీవనం?!

కొంతమంది వార్తల్లో నిలవకపోతే అది పెద్ద వార్త అవుతుంది. అలాంటివాళ్లల్లో నయనతార ఒకరు.

కొంతమంది వార్తల్లో నిలవకపోతే అది పెద్ద వార్త అవుతుంది. అలాంటివాళ్లల్లో నయనతార ఒకరు. ఎప్పుడూ ఏదో ఒక లవ్‌స్టోరీ ద్వారా వార్తల్లో నిలుస్తుంటారామె. ముందు హీరో శింబు.. తర్వాత కొరియోగ్రాఫర్-దర్శకుడు-నటుడు ప్రభుదేవా... ఇప్పుడు దర్శకుడు విఘ్నేశ్ శివన్. మొదటి ఇద్దరితో ఆమె పెళ్లి వరకూ వెళ్లి, ఆనక విడిపోయారు. తాజాగా విఘ్నేశ్ శివన్‌తో ప్రేమాయణాన్ని మాత్రం పెళ్లి పట్టాలెక్కించా రని చెన్నై టాక్. నయన-విఘ్నేశ్ సీక్రెట్‌గా పెళ్లి  తంతు ముగించారని కోడంబాక్కమ్ భోగట్టా.

చెన్నైలోని ఎగ్మూర్ ప్రాంతంలో ఇటీవల నయనతార ఖరీదైన ఇల్లు కొన్నారట. అందులో విఘ్నేశ్‌తో సహజీవనం చేస్తున్నారని టాక్. ఆ మధ్య ఓనమ్ పండగను ఇద్దరూ జాయింట్‌గా జరుపుకున్నారు. అప్పుడు బయటికొచ్చిన ఫొటోల్లో ఇద్దరి మధ్య లవర్స్ కన్నా మించిన కెమిస్ట్రీ ఏదో కనిపించిందని చూసినవాళ్లు అభిప్రాయపడుతున్నారు. సో.. నయన మూడో లవ్‌స్టోరీకి పెళ్లితో శుభం కార్డు పడినట్లేనా? లేక ఆ తంతు ముగియకుండానే ఇద్దరూ సహజీవనం చేస్తున్నారా? సినిమా రంగంలో ఏ రహస్యమూ చాలాకాలం దాగదు కాబట్టి, త్వరలోనే ఈ గుట్టు బయటపడుతుందని ఊహించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement