మనిషికి మరణం లేదా? | Archana's Panchami Releases On July 11 | Sakshi
Sakshi News home page

మనిషికి మరణం లేదా?

Jul 1 2014 12:07 AM | Updated on Sep 2 2017 9:36 AM

మనిషికి మరణం లేదా?

మనిషికి మరణం లేదా?

మరణం లేకుండా మనిషి జీవించడం ఎలా? అనే వినూత్న కథాంశంతో ఐడియా మూవీ క్రియేషన్స్ పతాకంపై డి. శ్రీకాంత్ నిర్మించిన చిత్రం ‘పంచమి’. సుజాత భౌరియా

మరణం లేకుండా మనిషి జీవించడం ఎలా? అనే వినూత్న కథాంశంతో ఐడియా మూవీ క్రియేషన్స్ పతాకంపై డి. శ్రీకాంత్ నిర్మించిన చిత్రం ‘పంచమి’. సుజాత భౌరియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ని అర్చన చేశారు. ఒకే ఒక్క పాత్రతో సాగే ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘అర్చన అందచందాలు, అభినయం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. అలాగే తనికెళ్ల భరణిగారు అందించిన వాయిస్ ఓవర్ అదనపు ఆకర్షణ అవుతుంది.
 
  తెలుగు తెరపై రాని కథతో రూపొందించిన ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘సైన్స్‌పరంగా దేవుళ్లే లేరని అంటున్న ఈరోజుల్లో నమ్మినవ్యక్తులను ఆ దేవుడు ఎలా కాపాడతాడు? అనే అంశాన్ని చూపించాం. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే చిత్రం ఇది. శ్రీకోటి స్వరపరచిన పాటలు, రఘు. ఆర్. కెమెరా పనితనం హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement