ఎనీ టైమ్ రెడీ | Any time I'm | Sakshi
Sakshi News home page

ఎనీ టైమ్ రెడీ

Apr 5 2014 12:12 AM | Updated on Sep 2 2017 5:35 AM

ఎనీ టైమ్ రెడీ

ఎనీ టైమ్ రెడీ

కుర్రకారును పిచ్చెక్కించే అందం ఇలియూనా సొంతం. నిన్నటి వరకు దక్షిణాది ప్రేక్షకులను తన అందచందాలతో మురిపించిన ఈ గోవా సుందరి ప్రస్తుతం ఉత్తరాది అభిమానులను అలరిస్తోంది.

కుర్రకారును పిచ్చెక్కించే అందం ఇలియూనా సొంతం. నిన్నటి వరకు దక్షిణాది ప్రేక్షకులను తన అందచందాలతో మురిపించిన ఈ గోవా సుందరి ప్రస్తుతం ఉత్తరాది అభిమానులను అలరిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి వేదాంతం మాట్లాడడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదేమిటో ఈ బ్యూటీ మాటల్లోనే విందాం. ఁనటిగా ప్రవేశించిన తొలి రోజుల్లో చాలా పోరాడాల్సి వచ్చింది. ప్రతిభ కనబరిస్తే అభిమానులు ఆదరిస్తారు. లేకుంటే షూటింగ్ స్పాట్‌లో కూడా మర్యాద ఇవ్వరు. దక్షిణాదిలో ప్రముఖ నాయికగా వెలుగొందినా హిందీలో బర్ఫీ చిత్రంలో నటిస్తున్నప్పుడు ఎవరూ గౌరవించలేదు. నా కఠిన శ్రమను గుర్తించిన తర్వాతే మర్యాద పెరిగింది. నటన అనేది ఒక వృత్తి మాత్రమే. దానిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉండాలి.

అదే సమయంలో ప్రతి వారికీ వ్యక్తిగత జీవితం  ఉంటుంది. యవ్వనం ఎల్లప్పుడూ ఉండదు. అది తగ్గుతున్నప్పుడు అభిమానుల్లోనూ మోజు తగ్గుతుంది. అందుకే నటనే జీవితమని భావించరాదు. ఏదో ఒక రోజు దానికి దూరం కావలసి వస్తుందని మా అమ్మ తరచూ చెబుతుంటారు. సినిమాకు గుడ్‌బై చెప్పాల్సిన సమయం వస్తే ఎప్పుడైనా దాన్ని సంతోషంగా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను. కొత్తగా అందమైన హీరోయిన్లు వస్తే ప్రముఖ హీరోయిన్లకు క్రేజ్ తగ్గుతుంది. ఎంతటి హీరోయిన్ అయినా ఒక రోజు ది ఎండ్ కార్డు వేస్తారు. ఎలాంటి పయనానికైనా అంతం ఉంటుంది* అని అంది. ఇలియానాకు ఏమై ఉంటుందంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు సినీ వర్గాలు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement