శ్రీదేవి క్వీన్‌ ఆఫ్‌ యాక్టింగ్‌: ఖేర్‌ | Anupam Kher calls Sridevi 'queen of acting' | Sakshi
Sakshi News home page

శ్రీదేవి క్వీన్‌ ఆఫ్‌ యాక్టింగ్‌: ఖేర్‌

Apr 4 2017 7:29 PM | Updated on Sep 5 2017 7:56 AM

శ్రీదేవి క్వీన్‌ ఆఫ్‌ యాక్టింగ్‌: ఖేర్‌

శ్రీదేవి క్వీన్‌ ఆఫ్‌ యాక్టింగ్‌: ఖేర్‌

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌... అతిలోక సుందరి శ్రీదేవిపై ప్రశంసల జల్లు కురిపించారు.

ముంబయి: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌... అతిలోక సుందరి శ్రీదేవిపై ప్రశంసల జల్లు కురిపించారు. క్వీన్‌ ఆఫ్‌ యాక్టింగ్‌ మళ్లీ తెరపై కనిపించడం సంతోషంగా ఉందని ఆయన ట్విట్‌ చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి నటిస్తున్న 'మమ్‌' టీజర్‌ లింక్‌ను కూడా అనుపమ్‌ ఖేర్‌ షేర్‌ చేశారు. అనుపమ్‌ ఖేర్‌ పలు చిత్రాల్లో శ్రీదేవితో కలిసి నటించారు. వీరిద్దరూ 'కర్మా', చాల్‌బాజ్‌, లడ్లా, లమ్హే, రూప్‌కీ రాణీ చోరోంకా రాజా చిత్రాల్లో శ్రీదేవితో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత శ్రీదేవి 2012లో 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌' చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విజయ్‌ హీరోగా నటించిన తమిళ చిత్రం పులిలో ఓ ముఖ్యపాత్ర పోషించారు.

తాజాగా రవి ఉడయార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మమ్‌' చిత్రంలో శ్రీదేవి మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బోనీకపూర్‌ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లోనూ రూపుదిద్దుకుంటోంది. జూన్‌ 14న మామ్‌ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో పాకిస్తానీ నటులు సజల్‌ అలీ, అద్నాన్‌ సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో సవతి కూతురికి జరిగిన అన్యాయంపై పోరాడే ఓ ధీరోదాత్తమైన తల్లిగా శ్రీదేవి కనిపించనున్నట్టు తెలుస్తోంది. మరో విశేషం ఏంటంటే బాలనటిగా కెరీర్‌ ప్రారంభించిన శ్రీదేవి ఇప్పటివరకూ 299 చిత్రాల్లో నటించారు. ‘మామ్‌’తో ఆమె 300వ చిత్రం మైలురాయిని చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement