సుప్రీమ్ డైరెక్టర్తో మాస్ మహరాజ్ | anil ravipudi next movie with ravi teja | Sakshi
Sakshi News home page

సుప్రీమ్ డైరెక్టర్తో మాస్ మహరాజ్

May 10 2016 12:33 PM | Updated on Sep 2 2018 5:18 PM

పటాస్ సినిమాతో సక్సెస్ఫుల్గా ఎంట్రీ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి. ఎన్నో ఏళ్లుగా ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్కు ఆ కోరిక తీర్చిన అనీల్, ఒక్కసారిగా ఇండస్ట్రీ...

పటాస్ సినిమాతో సక్సెస్ఫుల్గా ఎంట్రీ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి. ఎన్నో ఏళ్లుగా ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్కు ఆ కోరిక తీర్చిన అనీల్, ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్., ఇలా అన్ని ఎలిమెంట్స్ను కలిపి ఓ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కించి యంగ్ హీరోల దృష్టిలో పడ్డాడు.

అదే జోరులో తన రెండు సినిమాను కూడా కమర్షియల్ సక్సెస్గా నిలబెట్టాడు అనీల్. సాయిధరమ్ తేజ్ హీరోగా సుప్రీం సినిమాను తెరకెక్కించిన అనీల్ రావిపూడి, ఈ సినిమాలో కూడా తన మార్క్ చూపించాడు. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సుప్రీం, మంచి టాక్తో పాటు అదే స్థాయి వసూళ్లను కూడా సాధించింది. ఈ సినిమా సక్సెస్తో ఇప్పుడు సీనియర్ హీరోల మీద దృష్టి పెడుతున్నాడు అనీల్.

తన మేకింగ్ స్టైల్కు తగ్గట్టుగా పక్కా మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోతో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. టాలీవుడ్ ప్రేక్షకులు మాస్ మహరాజ్గా పిలుచుకునే సీనియర్ హీరో రవితేజతో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం రాబిన్ హుడ్ సినిమాలో నటిస్తున్న రవితేజకు త్వరలోనే ఓ మాస్ కథ వినిపించడానికి రెడీ అవుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement