కత్తిలాంటి ఆలోచన | Andrea Jeremiah gets a badass avatar for her next | Sakshi
Sakshi News home page

కత్తిలాంటి ఆలోచన

Apr 30 2018 1:26 AM | Updated on Apr 3 2019 6:34 PM

 Andrea Jeremiah gets a badass avatar for her next - Sakshi

ఆండ్రియా జెర్మియా

అడవిలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు కనీస అవసరాలకు సరిపడా వస్తువులను సమకూర్చుకోవడమే కాదు... ఆయుధాలను కూడా తోడు తీసుకెళ్లాలి. లేకపోతే ప్రమాదం పలకరించిన ప్రతిసారి తప్పించుకోవడం కష్టం. అందుకే హీరోయిన్‌ ఆండ్రియా జెర్మియా తన వెంట పదునైన కత్తిని తీసుకెళ్లారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు  ఆమె ఎదో కత్తిలాంటి పదునైన ఆలోచన చేస్తున్నారు. ఇంతకీ.. ఆండ్రియా అడవిలోకి ఎందుకెళ్లారో చెప్పలేదు కదూ! తన కొత్త సినిమా కోసం. ఆండ్రియా ముఖ్య తారగా నాన్‌జిల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కా: ది ఫారెస్ట్‌’.

ఆదివారం సినిమా షూటింగ్‌ మొదలైంది. ‘‘చాలా టైమ్‌ వెయిట్‌ చేసిన తర్వాత ‘కా: ది ఫారెస్ట్‌’ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ మూవీ నా కంఫర్ట్‌ జోన్‌కి పూర్తి డిఫరెంట్‌ అని తెలుసు. కానీ ప్రయత్నిస్తా’’ అన్నారు ఆండ్రియా. ఈ సినిమాలో వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ పాత్రలో ఆండ్రియా కనిపించనున్నారని టాక్‌. ఈ సినిమా కాకుండా కమల్‌హాసన్‌ హీరోగా నటించిన ‘విశ్వరూపం 2’, ధనుష్‌ హీరోగా రూపొందిన ‘వడ చెన్నై’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారామె. ఆ రెండు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement