ఆ జ్ఞాపకాలు షేర్‌ చేసిన అనసూయ

Anchor Anasuya Shares Bhoodan Pochampally Visit photos - Sakshi

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్ సొంతూరిలో సందడి చేసిన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల అనసూయ తన తల్లి అనురాధతో కలిసి వారి సొంతూరైన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లికి వెళ్లారు. లాక్‌డౌన్‌ వల్ల చేనేత కార్మికులు తయారుచేసిన స్టాక్‌ అంతా పేరుకుపోయిందని.. వారికి అండగా నిలవాలని అనసూయ తన అభిమానులను, సన్నిహితులను కోరారు. అదే విధంగా గ్రామంలో పలువురికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 

గ్రామంలోని పలు అందమైన ప్రదేశాల్లో అనసూయ ఫొటోలు దిగారు. తన తల్లితో కలిసి సరాదాగా గడిపారు. తను ఎక్కువగా చేనేత దుస్తులే ధరిస్తానని.. చేనేతలు మన ఆస్తులు అని అనసూయ పేర్కొన్నారు. వారికి తోడుగా ఉంటానని చెప్పారు. కాగా, అనసూయ షేర్‌ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో కూడా అనసూయ భూదాన్‌ పోచంపల్లిలో పర్యటించిన సంగతి తెలిసిందే.(చదవండి : షూటింగ్‌లు స్టార్ట్‌.. యాంకర్స్‌ సందడి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top