మా నాన్న కళ్లల్లో మొదటిసారి నీళ్లు చూశాను! | Amitabh Bachchan remembered for a long time about her father | Sakshi
Sakshi News home page

మా నాన్న కళ్లల్లో మొదటిసారి నీళ్లు చూశాను!

Dec 28 2017 5:32 PM | Updated on May 28 2018 4:04 PM

Amitabh Bachchan remembered for a long time about her father - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్‌ని చాలాకాలం తరువాత  గుర్తు చేసుకున్నారు.   హిందీ కవి దివంగత హరివంశ్ రాయ్ బచ్చన్ కళ్లల్లో నేను మొదటిసారి నీళ్లు చూశానని బిగ్‌బాస్‌ తన ఇంస్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. నేను కూలీ సినిమా షూటింగ్‌లో ఉన్నపుడు ఓ ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానంతరం నేను ఇంటికి వెళ్లాను.. నన్ను చూడగానే ఒక్కసారిగా ఆయన కన్నీంటితో నన్ను కౌగిలించుకొని, ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ ప్రమాదం 1982 జులై 26న బెంగళూరులో జరిగింది.

‘నా జీవితం మొత్తంలో నేను ఎప్పుడూ మా నాన్న కళ్లల్లో నీళ్లు చూడలేదని.. కానీ నేను కూలీ సినిమా షూటింగ్‌లో ఉన్నపుడు ఓ ప్రమాదానంతరం ఇంటికి వచ్చిన వెంటనే ఆయన నన్ను చూసి గట్టిగా కౌగిలించుకుని, ఒక్కసారిగా కన్నీళ్లతో కూప్పకూలిపోయాడని’ అమితా బచ్చన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో  పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం అమితాబ్‌ టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డిలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement