హీరోల ‘హైట్‌ స్టోరీ’ పై ట్వీట్‌ | Amitabh Bachchan Funny job application | Sakshi
Sakshi News home page

Feb 18 2018 10:30 AM | Updated on May 28 2018 3:50 PM

Amitabh Bachchan Funny job application - Sakshi

అమితాబ్‌, కత్రినా-దీపిక (ఫైల్‌ ఫోటోలు)

సాక్షి, సినిమా : బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాజిక అంశాలతోపాటు మీడియాలో వచ్చే కథనాలపై స్పందిస్తూ మధ్య మధ్యలో ఛలోక్తులు కూడా పేలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్‌ ఆకట్టుకునేలా ఉంది.

పేరు.. అమితాబ్‌ బచ్చన్‌, పుట్టిన తేదీ.. 11.10.1942, అలహాబాద్‌, వయసు.. 76 సంవత్సరాలు, అనుభవం... 49 ఏళ్లలో సుమారు 200 చిత్రాల్లో నటించటం, తెలిసిన భాషలు.. హిందీ, ఇంగ్లీష్‌, పంజాబీ, బెంగాలీ, హైట్‌.. 6అడుగుల 2 అంగులాలు. ముఖ్య గమనిక.. మీకు హైట్‌ సమస్యలు ఉండబోవు

ఇంతకీ ఈ వ్యవహారం అంతా ఎందుకంటే... తాజాగా ఓ ముంబై దినపత్రిక బాలీవుడ్‌ హీరోల హైట్ల గురించి ప్రస్తావిస్తూ ఓ కథనం రాసింది. అందులో దీపిక, కత్రినా కైఫ్‌లు షాహిద్‌ కపూర్‌, అమీర్‌ ఖాన్‌ల కంటే చాలా హైట్‌ ఉంటారంటూ పేర్కొంది. పద్మావత్‌ సమయంలో భన్సాలీ, ఇప్పుడు థగ్స్‌ ఆఫ్‌ హిందోస్థాన్‌ కోసం విజయ్‌ కృష్ణ ఆచార్య కూడా వారి ఎత్తులను కవర్‌ చేయలేక ఇబ్బందులు పడుతున్నారంటూ కథనంలో వివరిచింది. దీంతో ఆ పత్రిక కట్టింగ్‌ను తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన బిగ్‌ బీ సరదాగా తాను వారికంటే హైట్‌ ఉన్నానంటూ పోస్టు చేశారన్న మాట. అన్నట్లు అమీర్‌ థగ్స్‌ ఆఫ్‌ హిందోస్థాన్‌లో బిగ్‌బీ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement