మలయాళంలో అమల | Amala plays lawyer in her comeback Malayalam film | Sakshi
Sakshi News home page

మలయాళంలో అమల

Aug 21 2016 7:14 PM | Updated on Sep 4 2017 10:16 AM

మలయాళంలో అమల

మలయాళంలో అమల

దాదాపు 20 ఏళ్ల తరువాత మలయాళ తెరపై మెరవనున్నారు అక్కినేని అమల. చాలాకాలంగా తెరకు దూరంగా ఉంటున్న ఆమె.. శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

దాదాపు 20 ఏళ్ల తరువాత మలయాళ తెరపై మెరవనున్నారు అక్కినేని అమల. చాలాకాలంగా తెరకు దూరంగా ఉంటున్న ఆమె.. శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మలయాళ సినిమాలో అమల నటించనున్నారు.

నూతన దర్శకుడు ఆంటోనీ సోనీ సెబాస్టియన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'కేరాఫ్ సైరాబాను' చిత్రంలో అమలా కీలకమైన పాత్రలో కనిపిస్తారట. లాయర్గా నటించనున్నారని వినికిడి. సైరాబాను పాత్రను నటి మంజు వారియర్ పోషిస్తుంది. ఓ సాధారణ ముస్లిం గృహిణికి, ఆమె కుమారుడికి మధ్య ఉన్న అనుబంధమే చిత్ర కథనంగా తెలుస్తోంది. ఈ చిత్రం సెప్టెంబరులో సెట్స్ పైకి వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement