పెద్దగా ఆలోచించాలి! | Amala Paul turns producer for Priyadarshan's film | Sakshi
Sakshi News home page

పెద్దగా ఆలోచించాలి!

Jul 17 2015 11:02 PM | Updated on Sep 3 2017 5:41 AM

పెద్దగా ఆలోచించాలి!

పెద్దగా ఆలోచించాలి!

మన ఆలోచనలు పెద్ద స్థాయిలో ఉంటే.. అభివృద్ధి కూడా అదే స్థాయిలోనే ఉంటుందని చాలామంది అంటుంటారు. అమలా పాల్ కూడా అదే అంటున్నారు.

 మన ఆలోచనలు పెద్ద స్థాయిలో ఉంటే.. అభివృద్ధి కూడా అదే స్థాయిలోనే ఉంటుందని చాలామంది అంటుంటారు. అమలా పాల్ కూడా అదే అంటున్నారు. అందుకే ‘థింక్ బిగ్ స్టూడియోస్’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఆరంభించారు. ‘నాన్న’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘నాయక్’ తదితర చిత్రాల్లో కథానాయికగా నటించిన అమలాపాల్ ఏడాది క్రితం తమిళ దర్శకుడు విజయ్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఉత్తమాభిరుచి గల చిత్రాలను అందించాలనే సంకల్పంతో ఈ భార్యాభర్తలు ఇప్పుడు నిర్మాతలుగా మారారు. తొలి ప్రయత్నంగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్, శ్రీయారెడ్డి కాంబినేషన్‌లో ఓ చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. దీనికి సంతోష్ శివన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించనున్నారు. ఆగస్ట్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నామనీ, అంతర్జాతీయ ప్రేక్షకులకు నచ్చే చిత్రం తీయాలనే పెద్ద ఆశయంతో ఈ సినిమా మొదలుపెట్టామనీ అమలాపాల్ విజయ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement