బ్రహ్మానందాన్ని పరామర్శించిన అల్లు అర్జున్‌ | Allu Arjun Visited Brahmanandam | Sakshi
Sakshi News home page

బ్రహ్మానందాన్ని పరామర్శించిన అల్లు అర్జున్‌

Feb 7 2019 2:22 PM | Updated on Feb 7 2019 2:22 PM

Allu Arjun Visited Brahmanandam - Sakshi

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంకు హార్ట్‌ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. దేశంలోనే అత్యుత్తమమైన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్’లో  గత నెల 14న ఆయనకు గుండె ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న బ్రహ్మానందాన్ని స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ పరామర్శించారు. ఆయన మునుపటి లా చురుక్కా సినిమాలు చేయాలని, మరింత కాలం మనల్ని నవ్వించాలని ఆయన ఆకాంక్షించారు.

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్‌ తీసుకున్న బన్నీ త్వరలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement