నవ్వులు పంచటానికి నాలుగోసారి

Allari Naresh's new movie launched - Sakshi

‘‘ఆహనా పెళ్లంట, యాక్షన్‌ 3డి, జేమ్స్‌ బాండ్‌’  సినిమాల తర్వాత హీరో ‘అల్లరి’ నరేశ్, ప్రొడ్యూసర్‌ అనిల్‌ సుంకర్‌ నాలుగో సినిమాకు రెడీ అయ్యారు. ఎటీవీ సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘నందిని నర్సింగ్‌ హోమ్‌’ ఫేమ్‌ పీవీ. గిరి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో నిర్వహించారు.‘‘నాలుగోసారి కూడా నవ్వులు పంచటానికి రెండింతలు ఎక్కువ టైమ్, మూడింతలు ఎక్స్‌ట్రా కేర్‌ తీసుకున్నాం. కచ్చితంగా బాక్సాఫీస్‌ వద్ద నవ్వులు వర్షం కురిపిస్తాం’’ అని పేర్కొన్నారు అనిల్‌ సుంకర.  ఈ సినిమాకు కెమెరా: నగేశ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గరికపాటి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top