కోపంలో ఊగిపోయిన తండ్రిపై నటి అసహనం

Alia Bhatt Tries To Calm Down Dad Mahesh At Shaheen Bhatt Book Launch - Sakshi

తల్లిదండ్రులు మహేష్‌ భట్‌, సోనీ రాజ్‌దాన్‌ స్పూర్తితో సినిమాల్లోకి వచ్చారు బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌. మహేష్ భట్ దర్శక నిర్మాత కావడంతో చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెంచుకున్న అలియా.. నటించిన తొలి చిత్రం ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ తోనే హిట్‌ సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో కలిసి బ్రహ్మాస్త్ర, సడక్‌-2 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. టాలీవుడ్‌లోనూ సందడి చేయనున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్మకత్వంలో భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీలో ఆమె నటిస్తున్నారు. ఇటీవల కుటుంబంతో కలిసి ఓ కార్యక్రమానికి హాజరైన అలియా తండ్రి మహేష్‌ ప్రవర్తన పట్ల అసహనానికి గురయ్యారు.

మహేష్‌ భట్‌ కూతురు, అలియా సోదరి షాహిన్‌ భట్‌ తాను డిప్రెషన్‌కు గురైన నాటి విషయాలను పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి భట్ కుటుంబం మొత్తం హాజరైంది.  ఈ ఈవెంట్‌కు అలియా భట్‌ కూడా వచ్చారు. ఈ సందర్భంగా తండ్రి ప్రవర్తనను చూసి అలియా కాస్తా నిరాశకు గురయ్యారు. మీడియా అడిగిన ప్రశ్నలకు భట్‌ సహనం కోల్పోయి మీడియాపై విరుచుకుపడ్డాడు. మధ్యలో అలియా కలుగజేసుకొని తండ్రిని శాంతించాలంటూ  పక్కన నుంచి సైగలు చేసినా.. ఆయన పట్టించుకోకుండా అలాగే మాట్లాడాడు. దీంతో అలియా కాస్తా తండ్రి ప్రవర్తన పట్ల అసహనానికి గురయ్యారు. ‘ఇలా జరుగుతుందని ముందే చెప్పానా’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. కాగా ఇందుకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top