మోడీని కరాటే నేర్పించమంటున్న అక్షయ్ కుమార్ | Akshay wants Modi to 'teach Karate' | Sakshi
Sakshi News home page

మోడీని కరాటే నేర్పించమంటున్న అక్షయ్ కుమార్

Jun 6 2014 1:41 PM | Updated on Aug 15 2018 2:20 PM

మోడీని కరాటే నేర్పించమంటున్న అక్షయ్ కుమార్ - Sakshi

మోడీని కరాటే నేర్పించమంటున్న అక్షయ్ కుమార్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కరాటేని ప్రజలందరికీ నేర్పించేలా చర్యలు తీసుకొమ్మని కోరారు అక్షయ్ కుమార్

కరాటే ఎక్స్పర్ట్, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ గత అయిదేళ్లుగా సెల్ఫ్ డిఫెన్స్ ను పాపులరైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మహిళలపై దాడులను తగ్గించాలన్నా, గూండాయిజం నశించాలన్నా ఆత్మరక్షణ కోసం కరాటేని అందరూ నేర్చుకోవాలన్నదే ఆయన ప్రయత్నం. దీని కోసం ఆయన ఒక ప్రత్యేక ట్రెయినింగ్ ఇన్స్ టిట్యూట్ కూడా స్థాపించారు.
 
అందుకే అక్షయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కరాటేని ప్రజలందరికీ నేర్పించేలా, స్కూళ్లలో తప్పనిసరిగా నాలుగేళ్ల కోర్సులను పెట్టేలా చర్యలు తీసుకొమ్మని కోరారు. కరాటేని విద్యలో భాగం చేయాలని ఆయన కోరారు. 
 
మోడీ తన ప్రతిపాదనకు ఓకే చెప్పారని, ఈ దిశగా చర్యలు తీసుకుంటారని అక్షయ్ అంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement