కలెక్షన్లతో దుమ్ములేపుతున్న 'ఎయిర్‌లిఫ్ట్‌' | Akshay Kumars film earns Rs. 54.70 cr in four days | Sakshi
Sakshi News home page

కలెక్షన్లతో దుమ్ములేపుతున్న 'ఎయిర్‌లిఫ్ట్‌'

Jan 27 2016 11:59 AM | Updated on Sep 3 2017 4:25 PM

కలెక్షన్లతో దుమ్ములేపుతున్న 'ఎయిర్‌లిఫ్ట్‌'

కలెక్షన్లతో దుమ్ములేపుతున్న 'ఎయిర్‌లిఫ్ట్‌'

బాలీవుడ్ యాక్షన్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ తాజా చిత్రం 'ఎయిర్‌లిఫ్ట్‌' భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

ముంబై: బాలీవుడ్ యాక్షన్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ తాజా చిత్రం 'ఎయిర్‌లిఫ్ట్‌' భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తొలి నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్ల మార్క్‌ను దాటింది. సినిమాలో బలమైన కంటెంట్‌ ఉండటం, ప్రక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు రావడం సినిమాకు ప్లస్‌గా మారింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో బాక్సాఫీసు వద్ద భారీగా బిజినెస్ చేస్తున్న ఈ చిత్రం ఇదేనని సినీ పండితులు  చెప్తున్నారు.

శుక్రవారం (22న) విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ. 12.35 కోట్లు వసూలు చేయగా.. శని, ఆదివారాల్లో వరుసగా రూ. 14.60 కోట్లు, 17.35 కోట్ల కలెక్షన్స్ తో అదరగొట్టింది. నాలుగోరోజు సోమవారం రూ. 10.40 కోట్లు వసూలు చేసింది. సోమవారం నాటికి కలెక్షన్లు కొద్దిగా తగ్గినప్పటికీ సినిమా దూకుడు మాత్రం తగ్గలేదని సినీ పండితులు చెప్తున్నారు. మొత్తంగా నాలుగు రోజుల్లో ఈ సినిమా రూ. 54.70 కోట్ల కలెక్షన్ రాబట్టింది. మున్ముందు కలెక్షన్ల జోరు కొనసాగే అవకాశముందని అంటున్నారు.

1990లో కువైట్‌పై ఇరాక్‌ దురాక్రమణ చేసిన సందర్భంలో అక్కడ చిక్కుకుపోయిన 1.70 లక్షలమంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే కథాంశంతో 'ఎయిర్‌లిఫ్ట్' సినిమా తెరకెక్కింది. రాజాకృష్ణ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా వార్ థ్రిల్లర్ లో అక్షయ్‌, నిమ్రత్‌ కౌర్ జంటగా నటించారు. ఈ సినిమాలో అక్షయ్‌ పోషించిన భారత సంతతి వ్యాపారవేత్త రంజిత్ పాత్రపై అభిమానుల నుంచి, విమర్శకుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement