బ్యాక్‌ టు హోమ్‌

Akhil3 Movie Completed 50 Days Long Shooting Schedule In London - Sakshi

అఖిల్‌ హీరోగా ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నిధీ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా లండన్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ‘‘దాదాపు 50 రోజుల క్రితం లండన్‌లో మొదలైన మా సినిమా షెడ్యూల్‌ ముగిసింది.

లండన్‌కు గుడ్‌ బై చెప్పాల్సిన టైమ్‌ వచ్చింది. మంచి అనుభవాలను ఫేస్‌ చేశాను’’ అని అఖిల్‌ పేర్కొన్నారు. ‘‘కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. కొత్త ఆశలతో లండన్‌కి గుడ్‌ బై చెబుతున్నాను’’ అన్నారు ని«ధి. లండన్‌ షెడ్యూల్‌లో ఓ పాటను కూడా కంప్లీట్‌ చేశారు. ఈ పాటకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌. ఈ సినిమాకు తమన్‌ స్వరకర్త.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top