‘అఖిల్‌ 3’ ఫస్ట్‌ లుక్‌ రాబోతోంది!

Akhil Akkineni New Movies First look Will Be Released On 19th September - Sakshi

‘అఖిల్‌’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ‘హలో’ సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు అక్కినేని అఖిల్‌. ఇక తన తదుపరి చిత్రంతో ఎలాగైన ఘన విజయం సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడీ కుర్ర హీరో. ‘తొలిప్రేమ’ సినిమాతో తొలిప్రయత్నంతోనే నిరూపించుకున్నాడు దర్శకుడు వెంకీ అట్లూరి. సరైన సక్సెస్‌ కోసం చూస్తున్న అఖిల్‌, వెంకీ అట్లూరితో కలిసి సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను రివీల్‌ చేయనున్నట్లు ప్రకటించారు. నాగార్జున బర్త్‌డే స్పెషల్‌గా ఫస్ట్‌లుక్‌ను రివిల్‌ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ లుక్‌ను మాత్రం రిలీజ్‌ చేయలేదు. తాజాగా చిత్రబృందం ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను సెప్టెంబర్‌ 19 సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top