అజయ్‌ ఆగయా

Ajay Devgn Starts Shooting For SS Rajamouli RRR Movie - Sakshi

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇందులో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామచరణ్‌కు జోడీగా ఆలియా భట్‌ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిరి్మస్తున్నారు. అజయ్‌ దేవగన్, రే స్టీవెన్‌సన్, అలిసన్‌ డూడీ, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మంగళవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనడానికి  అజయ్‌ ఆగయా (వచ్చారు).

‘‘రాజమౌళిగారిని వివిధ సందర్భాల్లో కలుసుకున్నప్పుడు ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రాజమౌళిగారితో కలిసి పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు అజయ్‌ దేవగన్‌. ఈ షెడ్యూల్‌ చిత్రీకరణ ఇంకా 25 రోజుల పాటు సాగుతుందని తెలిసింది. 1920 నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ 70 శాతానికి పైగా పూర్తయింది. ఈ సినిమాను పది భాషల్లో ఈ ఏడాది జూలై 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించింది. అయితే  విడుదల తేదీ మారుతుందనే ప్రచారం జరుగుతోంది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top