చిన్న విరామం | Aishwarya Rajesh Speaks About Lockdown | Sakshi
Sakshi News home page

చిన్న విరామం

Apr 29 2020 3:22 AM | Updated on Apr 29 2020 3:22 AM

Aishwarya Rajesh Speaks About Lockdown - Sakshi

‘‘లాక్‌డౌన్‌ వల్ల భరతనాట్యం నేర్చుకునే వీలు కుదిరింది’’ అంటున్నారు హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌. లాక్‌డౌన్‌ వల్ల తన రోజులు ఎలా గడుస్తున్నాయన్న విషయంపై ఐశ్వర్య స్పందిస్తూ – ‘‘లాక్‌డౌన్‌ను ప్రకటించగానే ముందు నిరుత్సాహపడ్డాను. ఎందుకంటే నేనెప్పుడూ పనితో బిజీగా ఉండాలనుకుంటాను. గతంలో క్లాసికల్‌ డ్యాన్స్‌లో ప్రావీణ్యత సంపాదించాలని ప్రయత్నించాను. అప్పట్లో కూచిపూడిలో శిక్షణ కూడా తీసుకున్నాను. కానీ అనుకోకుండా ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల నాకు కొంత ఖాళీ సమయం దొరికింది. దీంతో నేను ఎప్పుట్నుంచో కలలు కంటున్న భరతనాట్యాన్ని నేర్చుకుంటున్నాను. ఇందుకోసం కొన్ని వారాలుగా ప్రతిరోజూ రెండు గంటలు ఆన్‌లైన్‌ క్లాసులను ఫాలో అవుతున్నాను. కానీ కాస్త బ్యాక్‌పెయిన్‌ రావడంతో ప్రాక్టీస్‌కు చిన్న విరామం ఇచ్చాను. ఈ నొప్పి తగ్గాక సాధన ప్రారంభిస్తాను. ఇంకా ఈ లాక్‌డౌన్‌ సమయంలో కొత్త కొత్త వంటకాలు ప్రయత్నిస్తున్నాను. అలాగే నేను థియేటర్‌లో చూడలేకపోయిన సినిమాలను ఇప్పుడు చూస్తున్నాను. టీవీ సీరియల్స్‌ను కూడా ఫాలో అవుతున్నాను’’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement