అవునా! నిజమేనా? | Aishwarya Rajesh Getting Married Soon | Sakshi
Sakshi News home page

అవునా! నిజమేనా?

May 10 2019 10:32 AM | Updated on May 10 2019 10:32 AM

Aishwarya Rajesh Getting Married Soon - Sakshi

మనిషి జీవితంలో ప్రేమ, పెళ్లి చాలా ముఖ్యమైనవి, విశేషం అయినవి. వీటిలో ఏది జరగాలన్నా కాలం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక సెలబ్రిటీల విషయం ఈ రెండు అంశాలకు మీడియా ప్రాధాన్యతనిస్తుంది. ముఖ్యంగా కథానాయికల ప్రేమ, పెళ్లి విషయాల గురించి ఏ మాత్రం ఉప్పు అందినా, ఆ విషయానికి ప్రాముఖ్యత నిస్తారు. తాజగా నటి ఐశ్వర్యారాజేశ్‌కు కల్యాణ గడియలు దగ్గర పడ్డాయనే ప్రచారాన్ని సామాజిక మాధ్యమాలు మోసేస్తున్నాయి.

పదహారణాల తెలుగమ్మాయి ఐశ్వర్యారాజేశ్‌. తన తండ్రి వారసత్వాన్ని స్వీకరించి నటిగా రంగప్రవేశం చేశారు. అయితే మొదట్లో ఈ అమ్మడికి హీరోయిన్‌గా మంచి అవకాశాలు రాకపోయినా, నటిగా తనేమిటో నిరూపించుకోవడంపైనే ఐశ్వర్యారాజేశ్‌ దృష్టి పెట్టారు. సరిగ్గా అలాంటి అవకాశమే కాక్కముట్టై చిత్రంలో వరించింది. అందులో ఇద్దరు పిల్లలకు తల్లి పాత్రలో ఏ హీరోయిన్‌ చేయనటువంటి సాహసం చేసి నటించారు ఐశ్వర్య.

కథానాయకిగా రాణిస్తున్నా, ఇప్పటికి ఆమె కాక్క ముట్టై ఐశ్వర్యారాజేశ్‌ అనే ముద్ర నుంచి బయటపడలేదు. ఇటీవల కనా చిత్రంలో హీరోయిన్‌ సెంట్రిక్‌ పాత్రలో నటించి విమర్శకులను సైతం మెప్పించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు హీరోయిన్‌గా ఐశ్వర్యారాజేశ్‌ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే మాతృభాషలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇలాంటి సమయంలో ఆమెకు సంబంధించి ఇక వార్త సామాజిక మాధ్యమల్లో వైరల్‌ అవుతోంది. అదే త్వరలో పీపీపీ డుండుండుంకు రెడీ అవుతోందన్న వార్త. ప్రస్తుతం ఐశ్వర్య వయసు 29 ఏళ్లు. దీంతో పెళ్లికి తయారవుతోందనే ప్రచారం జరుగుతోంది. అంతే కాదు ఒక నటుడి ప్రేమలో ఉన్నారని, ఇటీవల ఒక చిత్రంలో తమ్ముడిగా ముఖ్యపాత్రలో నటించిన ఆ నటుడితో ఐశ్వర్యారాజేశ్‌ ఏడడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నారన్న టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. అయితే ఇందులో నిజం ఎంత ఉందన్నది తెలియాలంటే ఐశ్యర్యారాజేశ్‌ స్పందించాల్సి ఉంటుంది. మరి చూద్దాం ఈ ప్రేమ,పెళ్లి ప్రచారానికి తను ఎలా రెస్పాండ్‌ అవుతారో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement