అమ్మడి పెదాలను చూసి ట్విట్టర్‌ బిత్తరపోయింది! | Aishwarya Rai Bachchan purple lips at Cannes make Twitter laugh | Sakshi
Sakshi News home page

అమ్మడి పెదాలను చూసి ట్విట్టర్‌ బిత్తరపోయింది!

May 16 2016 3:27 PM | Updated on Sep 4 2017 12:14 AM

అమ్మడి పెదాలను చూసి ట్విట్టర్‌ బిత్తరపోయింది!

అమ్మడి పెదాలను చూసి ట్విట్టర్‌ బిత్తరపోయింది!

ఈసారి కాన్స్ చిత్రోత్సవంలో బాలీవుడ్ భామ ఐశ్వర్యరాయ్ ప్రతి అడుగూ హల్‌చల్‌ చేస్తోంది.

ఈసారి కాన్స్ చిత్రోత్సవంలో బాలీవుడ్ భామ ఐశ్వర్యరాయ్ ప్రతి అడుగూ హల్‌చల్‌ చేస్తోంది. వయస్సు పెరుగుతున్నా వన్నె తగ్గని అందంతో రెడ్‌ కార్పెట్‌పై మరోసారి తళుక్కున మెరిసింది. ఆమె స్టైల్స్‌, వేసుకున్న డిజైనర్‌ వస్త్రాలు మరోసారి ఆన్‌లైన్‌లో ట్రెండ్‌ సృష్టించాయి. కాన్స్‌లో అడుగుపెట్టిన నాటినుంచి ఇప్పటికీ ఐదుసార్లు ఆమె ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవ్వడాన్నిబట్టి ఈ 42 ఏళ్లు ప్రౌఢభామ ఇంకా తగ్గలేనది చాటుకుంటున్నది.

తాజాగా ఫ్యాషన్ సరిహద్దులు చెరిపేస్తూ.. డిజైనర్‌ రమీ కాడి రూపొందించిన డెలికేట్‌ అవుట్‌ఫిట్‌లో ఐశ్యర్య కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై దర్శనమిచ్చింది. ఆమె వేసుకున్న దుస్తుల కన్నా ఆమె అధరాలకు వేసుకున్న లిప్‌స్టిక్కే అందరి దృష్టిని ఆకర్షించింది. వంకాయ (పర్పుల్‌) రంగు పెదాలతో కాస్తా కొత్తగా, మరికాస్త చిత్రంగా ఐశ్యర్య కనిపించింది. చిత్రోత్సవంలో భాగంగా 'ఫ్రం ల్యాండ్ ఆఫ్‌ ద మూన్‌' చిత్ర ప్రీమియర్‌కు ఆమె ఆదివారం హాజరయ్యింది. అదేవిధంగా ఐశ్ తాజా చిత్రం 'సరబ్‌జిత్‌'ను కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఈ సందర్భంగా 'సరబ్‌జిత్‌' చిత్రయూనిట్‌తో ఆమె సెల్ఫీ కూడా తీసుకుంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆమె పెదాలను చూసి బిత్తరపోయిన ట్విట్టర్‌ వాసులు చిత్రవిచిత్రంగా కామెంట్లు పెడుతున్నారు. ఏషియన్‌ పెయింట్స్‌ వాడితే మీ పెదాలు ఇలా అవుతాయి అంటూ సెటైర్లు విసురుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement